2014 సంవత్సరంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని కొన్ని బీమా పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రజలందరికీ జీవిత బీమా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 
 
ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన స్కీం లో 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు చేరవచ్చు. ఈ స్కీంలో చేరాలనుకునే వ్యక్తికి ఏదైనా ఒక బ్యాంకులో ఖాతా ఉండాలి. రూపాయి కంటే తక్కువ ప్రీమియంతో ఈ స్కీంలో చేరవచ్చు. ఈ స్కీంలో చేరినవారు సంవత్సరానికి 330 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ బీమా పథకంలో చేరిన తరువాత ఏ కారణం చేతనైనా చనిపోతే 2 లక్షల రూపాయలు నామినీకి అందజేస్తారు. 
 
ఒక అకౌంట్ నుండి మత్రమే ఈ బీమా ప్రీమియంను చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఒకే అకౌంట్ నుంచి ప్రీమియం చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా క్లెయిమ్ మాత్రం ఒకటే ఉంటుంది. అందువలన ఒకే అకౌంట్ నుండి ప్రీమియం చెల్లించాలి. ప్రతి సంవత్సరం 330 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బీమా కవరేజీ ప్రీమియం చెల్లించిన సంవత్సరం మాత్రమే ఉంటుంది. 
 
జూన్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు బీమా కవరేజీ పీరియడ్ ఉంటుంది. బ్యాంకు ఖాతాలో ఆటో డెబిట్ సదుపాయం ద్వారా ఈ ప్రీమియంను చెల్లించవచ్చు. సామాన్య ప్రజలకు ఈ బీమా పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పాలసీదారు మరణించినప్పుడు బ్యాంకు ఖాతా ఉన్న శాఖలోకి వెళ్లి ఆ సమాచారాన్ని ఇచ్చి ఇన్సూరెన్స్ క్లెయిం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: