శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశను నవంబర్ 27వ తేదీ రాత్రి షాద్‌నగర్ సమీపంలోన నలుగురు కిరాతకులు  దారుణంగా రేప్ చేసి పెట్రోల్ పోసి కాల్చి చంపేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఘటన జరిగిన చటాన్‌పల్లికి తీసుకొచ్చి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఆ సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు యత్నించడంతో నలుగురి ని ఎన్‌కౌంటర్ చేశారు.

 

నిర్భయ ఘటన తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా అంతటి సంచలనం రేపిన 'దిశ' ఘటన నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో తెలంగాణ పోలీసను యావత్ భారత దేశం అభినందను తెలిపింది. అంతేకాదు ప్రజల దృష్ఠిలో దేవుళ్ళు అయిపోయారు. మిగతా రాష్ట్రాల పోలీసులు తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోవాలంటూ సోషల్‌మీడియాలో కీర్తిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై దిశ తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు తిరిగి రాలేకపోయినా నిందితులను కాల్చి చంపడంతో తమకు కాస్త మనశ్శాంతిగాగా ఉందని దిశ తల్లి అన్నారు.

 

ఏడేళ్లైనా నిర్భయకు న్యాయం జరగలేదు. నా కూతురికి 10 రోజుల్లోనే న్యాయం చేసిన పోలీసులకు ధన్యవాదాలు. నిందితుల ఎన్‌కౌంటర్‌తో మాకు మనశ్శాంతి కలిగింది. ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని ఊహించలేదు. నా కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ మృగాళ్ల శవాలను చూడాలని ఉంది. వాళ్లను చంపినా మా కూతురు లేదన్న బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది... అంటూ దిశ తల్లి ఆవేదన చెందారు.ఇక ఇలాంటివి మళ్ళీ జరగకుండా జరిగిన ఈ ఎన్‌కౌంటర్ పై యావత్ ప్రజానికం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మృగాలకు తగిన శాస్తి జరిగిందని దిశకు సరైన న్యాయం జరిగిందని అంటున్నారు.  ఇదే ఘటనపై నిర్భయ తల్లి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: