తెలంగాణ పోలీస్, ఎవరి నోట మాట విన్నా ఇదే వినపడుతోంది ఇప్పుడు. దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులు ప్రశంసలు అందుకుంటున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, మీడియా తెలంగాణ పోలీసులను అభినందనలతో ముంచెత్తారు. హాష్ టాగ్ తెలంగాణ పోలీస్, హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్, సోషల్ మీడియాల్లో టాప్ ట్రేండింగులో ఉన్నాయి. 

 

హైదరాబాద్ ఇమేజ్ అంతా ఇంత కాదు దేశంలోనే ఐటీ, పలు కార్పొరేట్ కంపెనీలకు నెలవు, కొన్ని లక్షల మంది వేరే ఊళ్ల నుంచి వచ్చి హైదరాబాదులో ఉపాధి పొందుతున్నారు. అలాంటి హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నవంబర్ 27న, ఒక యువతి అత్యాచారం ఆపై దారుణంగా సజీవ దహనం, అత్యంత కిరాతకంగా యువతిని చంపారు. దీనితో హైదరాబాదులో అమ్మాయల భద్రతపై మరోసారి సందేహాలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్ అమ్మాయిలకు సేఫ్ కాదంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి, దేశ వ్యాప్తంగా హైదరాబాద్ అమ్మాయిలకు సేఫ్ కాదంటూ ప్రచారం జరిగింది.

 

ఈ నేపథ్యంలో దిశ హత్య కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు, ఆ తరువాత కోర్టు నుంచి నిందితులను పది రోజులకు గానూ కస్టిడీకి అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా నిందితులను ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకువెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు ఒక్కసారిగా పోలీసుల ఆయుధాలు లాక్కొని కాల్పులకు తెగబడ్డారు, గత్యంతరం లేక ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితులను కాల్చి చంపారు. 

 

ఈ ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం అమ్మాయిల జోలికి వస్తే దేత్తడే అంటూ గూబ గుయ్యుమనేలా సమాధానం చెప్పారు. అలాగే హైదరాబాద్ అమ్మాయిలకు సేఫ్ అని చాటి చెప్పారు. అమ్మాయిల జోలికి వస్తే కుక్క చావు తప్పదంటూ తెలంగాణ రాష్ట్రం చెప్పకనే చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: