దిశ అత్యాచార కేసు దేశం మొత్తాన్ని కుదిపేస్తున్నది.  దిశపే అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది... ప్రతి ఒక్కరిని రోడ్డుపైకి వచ్చేలా చేసింది.  ఇలాంటి ఘటనలు దేశంలో పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  ఎన్ కౌంటర్ ఎలా జరిగింది అనే విషయాలను పోలీసులు నిన్ననే మీడియాకు వివరించారు.  మరోవైపు దేశంలో దిశకు జరిగిన అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదు అని చెప్పి మహిళలు కోరుకుంటున్న సమయంలోనే దిశ ఎలాంటి అన్యాయం జరిగిందో అలాంటి అన్యాయమే ఉన్నావో మహిళకు జరిగింది.  


గతేడాది 23 ఏళ్ల యువతిపై కొందరు దుండగులు అత్యాచారం చేశారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని పట్టుకొని జైలుకు పంపారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఆ నిందితుడు బయటకు వచ్చి.. అమ్మాయిపై పగను పెంచుకున్నాడు.  ఐదో తేదీ మధ్యాహ్నం సమయంలో రాయ్ బరేలి కి వెళ్లి తిరిగి వస్తుండగా ఉన్నావో శివారులో తనపై అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు మరికొంతమంది వ్యక్తులు వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారు.  


ఆ యువతి కాలిపోతూనే పోలీసులకు ఫోన్ చేసింది.  క్షణాల్లో అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.  అప్పటికే 90శాతానికి పైగా కాలిపోయిన యువతి, నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో మరణించింది.  నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె ఆఖరు కోరికగా తల్లిదండ్రులను కోరింది.  అయితే, కానీ, ఆమె ఆఖరు కోరిక తీరకుండానే మరణించింది.  ఉన్నావో బాధితురాలు చనిపోయిందనే వార్తా ఇప్పుడు సంచలనం సృష్టించింది.  


యూపీలో అలజడి మొదలైంది.  నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.  జైలు శిక్ష విధించినా లాభం లేదని, నేరస్వభావం కలిగిన వ్యక్తులు జైలుకు వెళ్లినా తిరిగి మరలా అదే పని చేస్తున్నారని, అలాంటి వారిని చంపడం కంటే మరో శిక్ష అవసరం లేదని, హైదరాబాద్ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని యూపీ పోలీసులు కూడా తీసుకోవాలని లేదంటే తమకు అప్పగించాలని పోలీసులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: