దిశ ఘటనలో ప్రధాన నిందితులను పోలీసులు కాల్చి చంపిన సంగతీ తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్లను మెజారిటీ ప్రజలు స్వాగతిస్తున్నారు. కానీ కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మానవ హక్కుల వాళ్లు సొల్లు కబుర్లు చెబుతూ జనాలకు ఇంకా కోపం తెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్ట్ లాయర్ పోలీసుల మీద కేసు నమోదు చేయాలంటూ సంచలన ప్రకటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. పోలీసులే ఎన్ కౌంటర్ చేస్తే చట్టాలు ఎందుకు .. ఈ వ్యవస్థ ఎందుకంటూ మండిపడింది. కానీ ఆమె వ్యాఖ్యలకు నెటిజన్స్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. 

 

శ వ్యాప్తంగా సంచలనం రేపిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను తక్షణమే ఎన్ కౌంటర్ చేసి పారేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీని గురించి పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. అయితే సీన్ రికన్స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులను దిశ చనిపోయిన స్పాట్ కు తీసుకొచ్చారు. అయితే నిందితులు తప్పించుకోబోతుండగా పోలీసులు వారిని కాల్చి చంపేశారు. దీనితో సరిగ్గా ప్రియాంక రెడ్డి ఎక్కడ అయితే చనిపోయిందో వారు కూడా అక్కడే చనిపోవటం విశేషం. దీనితో ప్రజా సంఘాలు .. ప్రజలు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

దేశ వ్యాప్తంగా దిశ ఘటన సంచలనం రేపిన సంగతీ తెల్సిందే. ఈ ఘటన పై దేశ ప్రజలు భగ్గుమన్నారు. సినీ ప్రముఖులు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశ పార్లమెంట్ ఈ ఘటన పై భగ్గుమన్నది. ఈ ఘటనకు వ్యతిరేకంగా యావత్ భారతావని గొంతెత్తుతోంది. దిశ దారుణ హ్యతకు నిరసనగా ప్రజలంతా రోడ్లపైకి ఎక్కారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి లోకం, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలా సమాజం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని కొట్టుకున్నారు. ఇప్పుడు సరిగ్గా అటువంటిదే జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: