దిశ కేసును ముగించిన తీరు చాలా చక్కగా ఉందని పలువురు ప్రశంశలు కురిపిస్తున్నారు. కాని దిశను చంపిన కామాంధులను చంపడంతో ఇప్పటివరకు ఇలాంటి నీచుల చేతిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందా నలుగురు మానవ మృగాలు మరణిస్తే సమస్య ఇంకా పరిష్కారం కానట్లే. ఎందుకంటే ఇలాంటి వారు ఇంకా ఉన్నారు. అమ్మాయిలమీద అత్యాచారం చేసి ఇప్పటికి బయట తిరుగుతున్న వారెందరో మనకు లోకంలో కనిపిస్తారు.

 

 

ఇకపోతే 2012 డిసెంబర్‌ 16న జరిగిన సంచలనాత్మక ‘నిర్భయ’ ఘటనలో అత్యాచారం, హత్య, కిడ్నాప్, దోపిడీ, దాడి వంటి పలు కేసుల కింద అరెస్ట్‌ అయిన ఆరుగురు నిందితులలో ఒకరు బాలనేరస్థుడు. జైల్లోనే అతడి శిక్షాకాలం పూర్తవడంతో విడుదల చేశారు. మిగిలిన ఐదుగురిలో రామ్‌సింగ్‌ అనే నిందితుడు విచారణ జరుగుతున్న కాలంలోనే  చనిపోయాడు. మిగతా నలుగురికి కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే ఇంతవరకు ఆ శిక్ష అమలు అవలేదు. దీనిపై ఈ నెల 13న ఆశాదేవి మళ్లీ కోర్టును ఆశ్రయించబోతున్నారు.

 

 

వారికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉందని వస్తున్న వార్తలు నా మనసును కలచివేస్తున్నాయి. అదే నిజమైతే నా కూతురి ఆత్మకు శాంతి చేకూరదు’’ అని ఆశాదేవి అన్నారు. ఇదే కాకుండా ఇప్పుడు దిశకు జరిగిన అన్యాయమే తన కూతురుకు జరిగిందని కాని నా కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వారికి శిక్ష అమలు చేసినప్పుడే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుంది.

 

 

ఈ ఏడేళ్లూ నేను నిర్భయకు న్యాయం చేయాలని కోరుతూ చాలామందినే కలిశాను. అందరూ హామీ ఇచ్చారే కాని, ఆచరణ మాత్రం శూన్యమే. ఇప్పుడు దిశ కేసులో జరిగిన ఎన్‌కౌంటర్‌ తర్వాతైనా నిర్భయ నిందితులకు వెంటనే ఉరిశిక్షను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయవ్యవస్థను మరోసారి అభ్యర్థిస్తున్నాను. అత్యాచారం తర్వాత నా కూతురు పదిరోజులు బతికే ఉంది. ప్రతిరోజూ కొద్ది కొద్దిగా మరణించడం నా కళ్లతో చూస్తూ ఉండిపోయాను. పది రోజుల పాటు, ఆమెకు కనీసం చెంచాడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయాను’’ అంటూ బరువైన హృదయంతో అన్నారు ఆశాదేవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: