క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉందన్న మాటేకానీ రాష్ట్రంలో బిజెపి బలం సున్నా. అలాగే దాదాపు ఆరు సంవత్సరాల క్రితమే పార్టీ పెట్టాడన్నమాటే కానీ ఇప్పటి వరకూ దిక్కు దివాణం లేదు జనసేనకు. అంటే పార్టీ నిర్మాణం జరగలేదు. సభ్యత్వ నమోదు లాంటివి పద్దతిగా జరగలేదు.

 

అదే సమయంలో అసలు పార్టీని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలనే విషయంలో కనీస పరిజ్ఞానం కూడా లేదు.  చుక్కాని లేని నావలాగ జనసేన అనే పడవ ప్రయాణిస్తోంది. అసలు పార్టీని నడిపేంత సమర్ధత, ఓపిక పవన్ కు లేదన్నది వాస్తవం. అందుకే పై రెండు పార్టీలు కలుసేందుకు మార్గం సుగమమవుతోంది. నిజంగానే రెండు పార్టీలు కలిస్తే ఏమవుతుంది ? మహా అయితే చంద్రబాబునాయుడు నష్టపోతారేమో ? అంతే కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టమేమీ లేదు.

 

తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే బిజెపిలో జనసేన విలీనం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని అర్ధమైపోతోంది. బిజెపికి తాను ఎప్పుడూ దూరం కాలేదన్నారు. తన పార్టీని బిజెపిలో విలీనం చేసే విషయమై ఇపుడే ఏమీ చెప్పలేనన్నారు. బిజెపిలో జనసేనను విలీనం చేయమని కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనను అడిగినట్లు ఆమధ్య పవన్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

 

సో అప్పుడు చెప్పిన మాటలు, తాజాగా చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే జనసేనను బిజెపిలో విలీనం చేయటానికి పవన్ డిసైడ్ అయినట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే పార్టీని నడిపేంత ఓపికి పవన్ కు లేదన్నది వాస్తవం. అదే సమయంలో బిజెపి కూడా నాయకత్వలోపంతో అవస్తలు పడుతోంది. ఇపుడున్న నేతల్లో ఒక్కరికి కూడా జనాకర్షణ శక్తి లేదన్నది వాస్తవం.

 

పార్టీ నిర్మాణమున్నా, సభ్యత్వ నమోదు జరుగుతున్నా గట్టి నేతలు లేని కారణంగానే కమలం పార్టీ ఎదగలేకపోతోంది. పార్టీలో ఇపుడున్న నేతలెవరికీ సొంతంగా పట్టుమని వంద ఓట్లు కూడా తెచ్చుకునేంత సీన్ లేదు. కాబట్టి తమ రెండు పార్టీలు కలిస్తే అన్నా బిజెపి దశ తిరుగుతుందేమో అని కమలనాధులు  ఆశతో ఉన్నారు. అందుకనే పవన్ కు గాలమేసినట్లు అనిపిస్తోంది. ఆ ముచ్చట కూడా ఏదో అయిపోతే అప్పుడు తెలిసిపోతుంది ఎవరి సత్తా ఏమిటో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: