దేశం ఇప్పుడు ఎక్కడ చూసినా దిశ గురించే చర్చించుకుంటున్నారు.  దిశ కేసును తలచుకుంటున్నారు.  దిశకు న్యాయం జరిగిందని అంటున్నారు.  దిశ కేసులో ఎంతో విలువైన సమాచారం రాబట్టారు.  చట్టం ముందు నిలబెట్టేందుకు పోలీసులు సీన్ రి కన్స్ట్రక్షన్ కోసం నిందితులను చటాన్  పల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చిన సమయంలో నిందితులు అక్కడి నుంచి తప్పించుకోవాలని చూశారు.  ఆ క్రమంలోనే నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.

 

 
ఈ ఎన్ కౌంటర్ గురించి ఇప్పుడు దేశంలో ప్రధానంగా చర్చజరుగుతున్నది.  2012 డిసెంబర్ లో జరిగిన నిర్భయ అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  నిందితులను అరెస్ట్ చేసిన తరువాత వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం.. కోర్టు మరణ శిక్ష విధించడం జరిగింది.  అందులో ఓ మైనర్ ఉండటంతో అతన్ని మూడేళ్ళ శిక్ష తరువాత వదిలేశారు.  ఇందులో ఒక నిందితుడు 2013లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  

 


కాగా, దిశ విషయంలో తక్షణం న్యాయం జరిగినపుడు నిర్భయ విషయంలో ఎందుకు జరగలేదని ప్రజలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయంలో ఈ కేసును హ్యాండిల్ చేసిన పోలీస్ ఆఫీసర్ కొన్ని విషయాలను పేర్కొన్నారు.  అప్పట్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయని, నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలకు అప్పగించాలనే  డిమాండ్లు  వచ్చాయి.

 

 
ఎంత ఒత్తిడి వచ్చినా తాము తలొగ్గలేదని, తమ పనిని తాము చేసుకుంటూ పోయామని, టెక్నికల్ గా కేసును నిరూపించి నిందితులకు మరణశిక్ష విధించేలా చేశామని అన్నారు. అయితే, ప్రస్తుతం నిందితులు తీహార్ జైల్లో ఉన్నారు.  తీహార్ జైల్లో ఉన్న వీరు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్ పెట్టుకున్నారు.  అయితే, నిన్నటి రోజున కరడుగట్టిన నేరస్తులకు క్షమాభిక్షకు అర్హత లేదని రాష్ట్రపతి చెప్పడంతో.. వాళ్ళ కథ కూడా కొన్ని రోజుల్లోనే ముగిసేలా కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: