నిత్యానంద స్వామిపై దేశంలో ఎన్నో కేసులు ఉన్నాయి.  కొన్ని నేరాలకు సంబంధించిన కేసులు ఆయనపై ఉండటంతో ఆయనకు సంబంధించిన పాస్ పోర్ట్ ను రెన్యూవల్ చేయలేదు ప్రభుత్వం.  రెన్యూవల్ కాకపోవడంతో.. నిత్యానంద స్వామి దేశం వదిలి వెళ్లేందుకు ఉండదు.  అయితే, తనకున్న పలుకుబడిని డబ్బును ఉపయోగించి దొంగతనంగా ఇండియా నుంచి పారిపోయే వెస్టిండీస్ దీవుల్లోని ఓ ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసి దానికి కైలాసం అని పేరుపెట్టి ఆ దేశానికీ ప్రధాని, ఇతర కేబినెట్ మంత్రులను కూడా నియమించారని, రోజు కేబినెట్ మీటింగ్లు జరుగుతూన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే.  


దీనికోసం కైలాష్ డాట్ ఓఆర్జీ అనే వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు చేశారు.  అధికారిక పాస్ పోర్ట్, జాతీయ జెండా, దానికి ఓ అజెండా అన్ని రూపొందించినట్టు ఆ వెబ్ సైట్ ఆధారంగా తెలుస్తోంది.  త్వరలోనే దానికి దేశం హోదాను తీసుకొస్తానని ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి.  ఇక ఇండియా విదేశాంగ శాఖ దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని, నిత్యానంద పాస్ పోస్ట్ రద్దు చేసినట్టు చెప్పింది.  


విదేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీలను అలర్ట్ చేసింది.  నిత్యానంద ఏ ఈదేశంలో ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.  దీంతో అన్ని  దేశాల్లోని ఇండియన్ ఎంబసీలు అలర్ట్ అయ్యాయి.  ఇక ఈక్వెడార్ ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది.  నిత్యానంద స్వామికి ఎలాంటి దీవిని అమ్మలేదని, శరణార్థిగా ఉండేందుకు అయన దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తిరస్కరించినట్టు చెప్పింది.  


దీంతో అయన ఈక్వెడార్ నుంచి హయతి వెళ్లారని ఈక్వెడార్ సమాచారం అందించింది.  ఈక్వెడార్ నుంచి హయతి వెళ్లిన నిత్యానంద స్వామిని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నది.  ఒకవేళ నిజంగా నిత్యానంద స్వామి దీవిని కొనుగోలు చేసి దానికి దేశం హోదాను తెచ్చుకొని హిందూ దేశంగా ప్రకటించి దానికి అయన అధ్యక్షుడిగా ఉంటె, ఇండియా  నిజంగా ఆయన్ను అరెస్ట్ చేయగలుగుతుందా? 

మరింత సమాచారం తెలుసుకోండి: