నిన్న ఉదయం పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలకు రాత్రి 7 గంటల సమయంలో డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. హైకోర్టులో పిల్ దాఖలు కావటంతో పోలీసులు శవాలను ఫ్రీజర్లలో భద్రపరిచారు. మహిళా హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను సవాలు చేస్తూ పిల్ దాఖలు చేశాయి. ఎన్‌హెచార్సీ కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్ కౌంటర్ చేస్తారని లేఖలో ప్రశ్నించింది.
 
ఎన్ కౌంటర్ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని మానవ హక్కుల సంఘం లేఖలో పేర్కొంది. నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం చేసి వీడియో తీయాలని ఎన్‌హెచార్సీ కోరింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 9వ తేదీన ఈ పిల్ పై విచారణ జరుపుతామని తెలిపింది. హైకోర్టు 9వ తేదీ రాత్రి వరకు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. 
 
ఎన్‌హెచార్సీ ఎన్ కౌంటర్ పై దర్యాప్తుకు ఆదేశించింది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు ఎన్‌హెచార్సీ నోటీసులు జారీ చేసింది. ఎన్‌హెచార్సీ మీడియాలో వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకొని కేసును సుమోటాగా స్వీకరించింది. ఈరోజు ఎన్‌హెచార్సీ బృందం రాష్ట్రానికి రానుంది. ఎన్‌హెచార్సీ బృందం ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంతో పాటు నిందితుల మృతదేహాలను పరిశీలించనుంది. 
 
మరోసారి నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ కౌంటర్ పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌హెచార్సీ బృందం మృతదేహాలను, ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి జాతీయ మానవ హక్కుల సంఘానికి నివేదిక ఇస్తుంది. నివేదికను బట్టి జాతీయ మానవ హక్కుల సంఘం చర్యలు తీసుకోనుంది. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పులు చేశారా...? లేదా...? అనే అంశంపై బృందం నివేదిక ఇస్తుంది. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: