హైదరాబాదులోని దిశ హత్య కేసులో ఎన్ కౌంటర్ కు గురైన నలుగురి నిందితుల మృతదేహాలకు నిన్న సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. అయితే అందులో వెలువడిన డేటా మరియు సాక్ష్యాలను చూసి పోలీసు వారంతా నిర్ఘాంతపోయారు. సజ్జనార్ మాట్లాడుతూ నేడు నిందితుల యొక్క డిఎన్ఏ ప్రొఫైల్ తో పాటు వారికి సంబంధించిన శాస్త్రీయ డేటాను మరియు సాక్ష్యాలను వారి మృతదేహాలు నుంచి సేకరించినట్లు ఆయన చెప్పారు. అయితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి హైదరాబాదు హత్యకేసు పైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను మీడియా వారికి తెలిపారు.


ఈ నలుగురి హంతకులు కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు చోట్ల మరికొన్ని కేసుల్లో కూడా ముద్దాయిలుగా ఉండవచ్చని వారి పోస్టుమార్టం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో తేలినట్లు తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగిన పలు రేప్ కేసుల్లో వీరిని నిందితులుగా పరిగణిస్తున్నట్లు అందుకు సంబంధించిన ఎన్నో లింకులు ఈ నలుగురికీ ముడిపడి ఉన్నట్లు సజ్జానార్ తెలిపారు. అయితే ఇప్పటి వరకూ వారు దొరకకుండా ఇలా ఎన్నో మానభంగాలు, హత్యలు జరిపారని.... కానీ హైదరాబాద్ ఉదంతంతో వారి ఘోరక్రీడలకు ఒక ముగింపు పలికామని పోలీసు వారు చెప్పారు.

 

ఇకపోతే నిన్న తెల్లవారుజామున చర్లపల్లి సెంట్రల్ జైలు నుండి శంషాబాద్ కి అనగా హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటనా స్థలం వద్దకు నిందితులను తీసుకొని వెళ్లి పోలీసులు క్రైమ్ రీ-కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా వారు పోలీసుల దగ్గర ఉన్న తుపాకులు లాక్కొని రాళ్లతో, కర్రలతో దాడి చేయగా పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. అలాగే పోలీసులు కూడా బాధితురాలి మొబైల్ ఫోన్ ను వెలికి తీసే పనిలో ఉండగా అక్కడ నిందితులతో పాటు పది మంది పోలీసు వారు రక్షణకు ఉన్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: