దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై అంతర్జాతీయ మీడియా కూడా తీవ్రంగా స్పందించింది. నవంబర్ లో దిశపై హత్యాచార ఘటన వెలుగు చూసిన దగ్గర నుండి జనాల్లోని స్పందనలు, ప్రతిస్పందనలు ఎలాగున్నాయో అందరికీ తెలిసిందే.  నిందితుల ఎన్ కౌంటర్ జరగ్గానే యావత్ దేశమంతా ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేసింది. సరే కొందరు ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు లేండి.

 

మనదేశంలో మీడియాలో కూడా ఎన్ కౌంటర్ ఘటన సంచలనంగా మారింది. శుక్రవారం ఉదయం నుండి ఇదే విషయాన్ని జాతీయ మీడియా కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. దేశమీడియా అంటే ప్రముఖంగా ప్రసారం చేసింది. మరి అంతర్జాతీయ మీడియా ఏమన్నది ?

 

ది వాషింగ్టన్ పోస్ట్ :  మహిళలు, బాలికలపై పెరిగిపోతున్న దారుణాలు పెరిగిపోతున్న నేపధ్యంలో నిందితుల ఎన్ కౌంటర్ పై దేశంలో హర్షం వ్యక్తమవుతున్నట్లు చెప్పింది. అదే సమయంలో పోలీసులు న్యాయపరిధిని దాటి నిందితులను ఎన్ కౌంటర్ చేశారంటూ మానవ హక్కుల సంఘాలు, న్యాయవాదుల కామెంట్లను ప్రచురించింది.

 

ది న్యూయార్క్ టైమ్స్ : ఈ హఠాత్పరిమాణం షాక్ కు గురిచేసిందని చెప్పింది. పోలీసు అధికారులు హీరోలుగా ప్రశంసలు పొందుతున్నట్లు కథనం ఇచ్చింది.

 

సీఎన్ఎన్ : ఎన్ కౌంటర్ ఘటనను మ్యాప్ లో చూపించింది. దిశ హత్యాచారం తర్వాత దేశంలో కనబడిన ఆందోళనను ప్రస్తావించింది. ఎన్ కౌంటర్ తర్వాత దిశ కుటుంబసభ్యుల కామెంట్లను చెప్పింది.

 

వాషింగ్టన్ పోస్ట్ : 2008లో సజ్జనార్ వరంగల్ ఎస్సీగా ఉన్నపుడు జరిగిన  ఎన్ కౌంటర్ తో తాజా ఎన్ కౌంటర్ ను పోల్చింది. వరంగల్  యాసిడ్ దాడిలో గాయాలపాలై ప్రస్తుతం డెన్వర్లో ఉంటున్న గతంలో  ప్రణీతతో చేసిన ఇంటర్వ్యూను తాజాగా ప్రచురించింది.

 

సీబిఎన్ : చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ఘటనను ప్రముఖంగా ప్రస్తావించింది. బాధితురాలి కుటుంబసభ్యులు, సామాజిక కార్యకర్తల అభిప్రాయాలను ప్రసారం చేసింది. దేశం మొత్తం మీద 2017లో జరిగిన 33 వేల అత్యాచారలను కూడా ప్రస్తావించింది.

 

యూఎస్ఏ టు డే :  దిశ హత్యాచార నిందుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ లో ప్రజల హర్షాతిరేకాలను ప్రముఖంగా ప్రచురించింది. ఇక బ్రిటీష్ మీడియా, ఖలీజ్ టైమ్స్, ది గార్డియన్ , ది టెలిగ్రాఫ్, అల్ జజీరా టివి లాంటి ప్రముఖ మీడియా కూడా ఎన్ కౌంటర్ పై ప్రత్యేక కథనాలు ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: