రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ తరువాత ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయ నిపుణులు దిశ కేసులో ఎన్ కౌంటర్ జరగకపోతే నిందితులకు శిక్ష పడటం అనుమానమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరూ లేరు. 
 
ఈ కేసులో బలమైన ఆధారాలు కూడా లేకపోవడంతో ఈ కేసు కోర్టులో నిలబడటం కష్టమేనని తెలుస్తోంది. పోలీసులు నిందితులే నేరం చేశారని నిరూపించటానికి బలమైన సాంకేతిక ఆధారాలు ఈ కేసులో లేవు. డీ.ఎన్.ఏ పరీక్ష ద్వారా నిరూపించాలన్నా కూడా దిశ శరీరం పూర్తిగా కాలిన నేపథ్యంలో సాధ్యం కాదు. న్యాయ నిపుణులు ఈ కేసులో ఆధారాల ద్వారా కేసును రుజువు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయటం అంత తేలిక కాదని చెబుతున్నారు. 
 
పోలీసుల ముందు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం కోర్టులో చెల్లదు. నిందితులు పోలీసులు బెదిరించి సాక్ష్యం చెప్పించారని చెప్పే అవకాశం ఉంది. పోలీసులు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించాలంటే నిందితులకు వైద్య పరీక్షలు జరిపి దుస్తులు, రక్తం, వీర్యం సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాల్సి ఉంటుంది. కానీ ఈ కేసులో ఆధారాలు చాలా బలహీనంగా ఉన్నాయని ఆ ఆధారాలతో కేసు నిలబడటం కష్టమేనని తెలుస్తోంది. 
 
బాధితురాలు దిశకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో కేసు రీ కన్ స్ట్రక్షన్ జరుగుతుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. నిందితులు పోలీసుల తుపాకులు లాక్కోవటంతో రాళ్లు రువ్వటంతో పోలీసులు నిందితులపై ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయటంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: