ఓవైపు దిశ అత్యాచారం, హత్య కేసు ప్రకంపనలు వారం రోజులుగా దేశాన్ని కుదపేస్తున్నాయి.

ఇంతలోనే నిందితలును ఎన్ కౌంటర్ చేసిపారేశారు. ఇక అమ్మాయిలను ఏడిపించేవాళ్లకు తుపాకీయే గుర్తు వస్తుందని మహిళలు సంబరపడుతున్నారు. కానీ ఎన్ కౌంటర్ ద్వారానో.. ఉరిశిక్షల ద్వారానో ఇలాంటి కామాంధులు, పురుషాహంకారులు తగ్గరని మరోఘటన రుజువు చేసింది.

 

ఉత్తర ప్రదేశ్ లో ఓ యువతిని గ్రామ పెద్ద తుపాకీతో కాల్చేసిన ఘటన ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ మధ్యలో ఆపినందుకు ఓ యువతిని గ్రామపెద్ద తుపాకితో కాల్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తిక్రీ గ్రామంలోని ఓ గ్రామ పెద్ద కుమార్తె వివాహం జరుగుతోంది.

 

ఈ వివాహ వేడుకలో ఇద్దరు యువతులు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ ద్వారా ఆయాసం వచ్చిందో.. ఇక చాలు అనుకుందో ఏమో గానీ ఓ యువతి డ్యాన్స్ ఆపేసింది.

దీంతో కోపం వచ్చిన గ్రామ పెద్ద బంధువులు ఒకరు ఆమెపై తుపాకితో కాల్పులు జరిపాడు. అందరూ చూస్తుండగానే ఆ అమ్మాయి వివాహ వేడుక వేదికపైనే కుప్పకూలింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

 

 

ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. యువతి డ్యాన్స్ ఆపగానే ఓ వ్యక్తి లేచి నిల్చుని తుపాకితో కాల్చనా? అని అడగడం, ఆ వెంటనే మరో వ్యక్తి ‘సుధీర్ భయ్యా.. మీరు షూట్ చేయండి’ అనడం వీడియోలో స్పష్టంగా వినబడుతోంది. అతడు ఆ మాట అనగానే సుధీర్ అనే ఆ గ్రామ పెద్ద బంధువు షూట్ చేశాడు. తూటా సరాసరి డ్యాన్సర్ కు తగలడంతో ఆమె కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియో నిమిషం నిడివి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: