దిశ హత్య కేసులోని నిందితులను హైదరాబాద్ పోలీసు వారు ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి నిన్న తన యూట్యూబ్ ఛానల్ ద్వారా దానిపై తన స్పందన పంచుకుంది. ఆమె ముందుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ వారికి రెండు చేతులెత్తి దండం పెడుతున్నట్టు చెప్పి వారు చేసిన పనిని విపరీతంగా మెచ్చుకుంది. సమాజంలో ఆడవారు ధైర్యంగా తలెత్తుకొని తిరగాలంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్పిన శ్రీరెడ్డి ఇటువంటి లైంగిక వేధింపులు తనకు కొత్త కాదని తన జీవితంలోని అనుభవాలను పంచుకుంది.

 

తను మెచ్యూర్ కాకముందు అనగా కేవలం ఆరేడేళ్ల వయసులోనే తన బంధువులు ఆమెను ఆడించే నెపంతో తనపై చేతులు వేసి నిమిరేవారిని శ్రీ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే స్కూల్ లోని టీచర్లు కూడా తనపై ఇలా ఎన్నో సార్లు అసభ్యకరమైన చర్యలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తను గుర్తుకు తెచ్చుకుంది. తెలిసీ తెలియని వయసులోనే తనపై ఇలా అసభ్యకరంగా తాకరాని చోట చేతులు వేస్తూ తనని లైంగికంగా హింసించేవారు అని చెప్పుకున్న శ్రీరెడ్డి అలాగే చాలా మంది మహిళలు స్కూల్ బస్సులో మరియు పబ్లిక్ బస్సులలో రోజూ వేధింపులకు గురి అవుతున్నారని వాపోయింది.

 

ఇలా ఆడపిల్లల శరీరాలతో ఇష్టం వచ్చినట్లు ఆడుకొని పైశాచికానందం అనుభవించే మృగాలను నిన్న జరిగిన విధంగానే కాల్చి పారేసే లాగా చట్టాలు రావాలని శ్రీ రెడ్డి డిమాండ్ చేసింది. ఎలాగైతే సరిహద్దులోని సైనికులు శత్రువుల పై కాల్పులు జరుపుతారో అలాగే మన సమాజంలో తిరుగుతున్న క్రూరమృగాలకు కూడా కఠినమైన శిక్షలు వేయాలని శ్రీ రెడ్డి ప్రభుత్వం మరియు పోలీసు వారిని కోరింది. ఇలా తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్న శ్రీరెడ్డి ఇండస్ట్రీలో కూడా తనపై ఇలాంటివి చాలానే జరిగాయని చెప్పుకొస్తూ ఎవరికైనా ఇది చెబితే నీకు సిగ్గు లేదా అని అడిగారని చెప్పింది. కానీ ఇప్పుడు ఇలా చేసే అందరూ మగవాళ్ళని వారికి సిగ్గు లేదా అని తాను ప్రశ్నిస్తున్నట్లు చెప్పింది శ్రీ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: