దిశ ఘటన.. గత పదిరోజులుగా ప్రతి ఒక్కరి మనసు కాల్చుకు తిన్న సంఘటన. వెటర్నరీ డాక్టర్ అయినా దిశను అతికిరాతకంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి ఆమె శవాన్ని ఆమె తల్లిదండ్రులు తాకనుకూడా తాకకుండా పెట్రోల్ పోసి కాల్చేశారు. దీంతో దేశమంతా వారిని చంపేయాలని ఎన్నో నినాదాలు చేసింది. 

                   

మాకు అప్పగించండి ఆ నీచుడిని అని పోలీసులపై చెప్పుల దాడి జరిగింది. అయితే ఆ కేసు నిందితులను మొన్న రాత్రి సీన్ కరెక్షన్ చేసేందుకు ఘటన స్థలానికి తీసుకెళ్లగా అక్కడ వాళ్ళు పోలీసులపై దాడి చేసేసరికి ఆత్మరక్షణ కోసం ఆ నిందితులను ఎన్కౌంటర్ చేసేశారు పోలీసులు. దీంతో ఈ ఎన్కౌంటర్ నిన్న అంత సంచలనం సృష్టించింది. 

                 

ఈ నేపథ్యంలోనే మొన్న రాత్రి పోలీసులు సీన్ రేకర్రెక్షన్ చేస్తుండగా ఆ నీచులైన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు.. పట్టుకోడానికి ప్రయత్నిస్తే పోలీసులపై ఎదురు దాడి చేశారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నరరూప రక్షేషులను ఎన్కౌంటర్ చేశారు. దీంతో ఆ నిందితులు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే నిన్న పోస్ట్ మార్టం చేశాక డిసెంబర్ 9 వ తేదీ వరుకు నిందితుల మృతుదేహాలను భద్రపరచాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది.  

 

అయితే నిన్న చటన్ పల్లి ఎన్కౌంటర్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ నిందితులపై కాల్పులు జరపగా ఆ శరీరంలో నుండి పడిన బులెట్ల కోసం గాలింపు చేపట్టారు. నిన్న రాత్రి నుండి ఆ బులెట్ల కోసం వెతుకుతున్నారు. రాత్రి నుంచి ఘటన స్థలంలోనే టెక్నికల్ టీం తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా నిందితుల మృతుదేహాలను రీపోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: