దిశ హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేసి సంచలనం సృష్టించారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ప్రజలు జేజేలు కొడుతున్నారు. కానీ కొంత మంది మాత్రం పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం బాలేదని, నిందితులను కోర్టులో హాజరు పరిచి ఉరి శిక్ష అమలు చేస్తే బాగుండేదని అభిప్రాయం పడుతున్నారు. 

 

ఈ నేపథ్యంలో నిందితులతో కలిసి ఒక పెట్రోల్ బంక్ లో పని చేసిన ఓ వ్యక్తి, నిందితుల గురించి భయంకర నిజాలు బయట పెట్టాడు. "శివ, చెన్నకేశవులు మూడు సంవత్సరాల క్రితం ఈ బంక్ లో పని చేశారు. శివ ముందుగా చేరగా ఆ తరువాత చెన్నకేశవులని తీసుకువచ్చి బంక్ లో చేర్చాడు. డ్యూటీ కి సరిగ్గా రాకుండా ఇబ్బంది పెట్టేవారు. బాగా తాగి డ్యూటీ కి వచ్చేవారు ఎన్ని సార్లు హెచ్చరించినా పద్దతి మార్చుకునే వారు కాదు. దీనికి తోడు బాగా మద్యం తాగి అర్ధరాత్రి సైలెన్సర్ లేని బైక్ తో రోడ్డు మీద హల్చల్ చేసేవారు. బంక్ కి ఎదురుగా ఉన్న ముసలమ్మ టీ కొట్టు లో ఉన్న కుర్చీలను విరగొట్టారు. ఇప్పటికీ ఆ కుర్చీలు ఇక్కడే ఉన్నాయి. 

 

సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్స్ చూసే వారు ఎవరైనా ఆడవాళ్లు పెట్రోల్ బంక్ కి పెట్రోల్ కి వస్తే తామే పెట్రోల్ పోయాలంటూ హీరోల్లా ఫోజ్ కొట్టేవారు. బంక్ కి వచ్చిన ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించే వారు. ఈ నేపథ్యంలో వారికి మహమ్మద్ అలియాస్ ఆరీఫ్ పరిచయమయ్యాడు. రోజూ బంక్ లో తాగడానికి ఇబ్బంది అవుతుందని లారీలో అయితే ఎంచక్కా తాగొచ్చని లారీ పనికి వెళ్లడం మొదలెట్టారు వాళ్ళు" అని చెప్పాడు గ్రామస్థుడు.

 

కానీ ఇంతటి ఘోరానికి పాల్పడతారని అస్సలు అనుకోలేదు. పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి మంచి పని చేశారు అని చెప్పాడు గ్రామస్థుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: