అత్యాచారాలు, హత్యాచారాల ఘటనలకు పాల్పడే నిందితులను ఎన్ కౌంటర్లు చేయాలంటూ సమాజంలోని అన్నీ వర్గాల నుండి డిమాండ్లు పెరగటం విచిత్రంగా ఉంది. దిశ హత్యాచారం ఘటనలోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా సీన్ మారిపోయింది. హత్యాచారం జరిగినపుడు పోలీసులపై జనాలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేశారో ఎన్ కౌంటర్ జరిగిందని తెలియగానే అంతటి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

 

హత్యాచారం, నిందితుల  ఎన్ కౌంటర్ ఘటనలు మామూలు జనాల్లో మారిపోతున్న మానసిక పరిస్ధితులకు అద్దం పడుతోంది. అత్యాచారం కావచ్చు లేదా హత్యాచారానికి బలైన బాధితులకు సత్వర న్యాయం జరగాలని కోరుకోవటంలో తప్పలేదు. కానీ నిందితులకు వెంటనే మరణశిక్షలు విధించాలని, జనాలందరి మధ్య కొట్టి చంపేయాలని, ఎన్ కౌంటర్ చేసేయాలంటూ డిమాండ్లు పెరిగిపోతుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

వరంగల్ ఓ యువతిపైన కూడా దిశ లాగే అత్యాచారం జరిగింది. బాధితురాని తల్లి, దండ్రులు, బంధులు, సన్నిహితులు ఇపుడు నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటూ డిమాండ్లు మొదలుపెట్టారు. విజయవాడలో దాదాపు ఏడేళ్ళ క్రితం  హత్యాచారానికి గురైన ఆయేషాభేగం తల్లి కూడా నిందితులను ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ చేస్తున్నారు.

 

అలాగే ఏడేళ్ళ క్రితం దేశ రాజధాని ఢిల్లీలో హత్యాచారానికి గురై నిర్భయ తల్లి కూడా ఇదే విధమైన డిమాండ్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో దిశపై హత్యాచారం చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేసినపుడు తన కూతురు నిర్భయపై హత్యాచారం చేసిన వాళ్ళను మాత్రం జైళ్ళల్లో ఎందుకు మేపుతున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

 

వివిధ ఘటనల్లో ఇప్పటికే అత్యాచారాలు, హత్యాచారాలు చేసి జైళ్ళల్లో శిక్షలు అనుభవిస్తున్నవారిని, విచారణలు ఎదుర్కొంటున్నవారిని కూడా వెంటనే ఎన్ కౌంటర్లు చేయాలంటూ బాధితుల తల్లి, దండ్రులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు చేస్తున్న డిమాండ్లకు ఎవరు సమాధానం చెబుతారు ? కొందరు సెలబ్రిటీలు కూడా ఇదే విషయమై ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. బాధితులందరికీ పోలీసులు ఒకే విధమైన న్యాయం చేస్తారా ? అంటూ జనాల ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా ?

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: