హైదరాబాద్ లో దిశను హత్య చేసిన మృగాళ్లను ఎన్కౌంటర్ చేసిన విషయం దేశ ప్రజలందరికీ విదితమే. అయితే ఆ ఎన్కౌంటర్ ని ప్రజలు, రాష్ట్రపతి, ఉన్నత అధికారులతో సహా అందరూ ఎందుకు మెచ్చుకుంటున్నారో తెలుసా? ఇగో, ఆ పైన ఉన్న ఫోటోని చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. నిజంగా... సో- కాల్డ్ 'ది గ్రేట్ ఇండియన్' చట్టాలు నేరం చేసిన వారికి రాచమర్యాదలు చేస్తారన్నది ఆ పై ఫోటో చూస్తే స్పష్టమవుతుంది.


వివరాల్లోకి వెళితే.. ఆ ఫొటోలో ఉన్నది తమిళనాడుకు చెందిన గోవిందాచామి. అతడో మానవ మృగం. దొంగతనం అతని వృత్తి... కాకపోతే... రైల్వేస్టేషన్ లో నివాసముంటూ వచ్చిన రైలల్ల ఎక్కి బిక్షగాడి వలె నటిస్తూ డబ్బులు దోచుకుంటూ ఉండేవాడు.
అప్పట్లో... సౌమ్య అనే ఒక 23ఏళ్ల అమ్మాయి సేల్స్ గర్ల్ గా కేరళ లో పని చేస్తుండేది.


అయితే అది 2011వ సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖు... సౌమ్య తన పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఎర్నాకుళం-షోరనూర్ పాసింజర్ రైలులోని మహిళా బోగీలోకి ఎక్కింది. ఆ బోగీలో ఆమె తప్ప మరెవరు లేరు. అదే సమయంలో గోవిందచామి సౌమ్య ఉన్న మహిళ బోగీ లోకే ఎక్కాడు. రైలు కదలడం ప్రారంభించింది. ఆ బోగీలో సౌమ్య... ఇంకా గోవిందాచామి తప్ప ఎవరు లేకపోవడంతో... వాడు మృగంలా మారి సౌమ్యని డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. ఆమె ఇవ్వనని చెప్పడంతో... ఆమె తలని రైలు బోగీకి వేసి గట్టిగ గుద్దాడు. కొంత సమయం తర్వాత ఆమెను బోగినుంచి బయటకు తోసివేశాడు. ఒక కిలోమీటర్ దూరం రైలు వెళ్లిన తర్వాత ఒక స్టేషన్ స్టాప్ రావడంతో... గోవిందాచమి రైలు దిగి సౌమ్య ని వెతుకుంటూ వెళ్ళాడు. చివరికి సౌమ్య తీవ్ర గాయాలతో ఒక దగ్గర కనిపించింది. దీంతో ఆమెను చెట్లపొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై కిరాతకంగా అత్యాచారం చేసి... అక్కడినుండి వెళ్ళిపోయాడు.

కొద్ది సేపటికి... సౌమ్యని... స్థానిక ప్రజలు... చెట్ల పొదల్లో గుర్తించి హాస్పిటల్ కి తరలించారు. కానీ ఆమె అదే నెల 6న చికిత్స పొందుతూ మృత్యువొడికి చేరింది. దీంతో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. కానీ సుప్రీమ్ కోర్టు మాత్రం... 'సౌమ్యని గోవిందాచమి రైలు నుంచి బయటకు తోసేశాడన్న ఆధారాలు లేవని, సౌమ్యనే రైలు నుంచి దూకిందని... అతడు కేవలం అత్యాచారమే చేశాడని' ప్రకటిస్తూ 7సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలా వాడిని దాదాపు 10సంవత్సరాలు మేపి.. ఎడమ ఫొటోలో బక్కగా ఉన్న గోవిందాను... కుడి వైపు లావుగా, హ్యాపీ గా, నవ్వుతూ ఉన్న గోవిందా గా మార్చించి మన భారతదేశ చట్టం.


ఒకవేళ దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయకపోతే... వాళ్లు హత్యాచారం చేసారని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు కాబట్టి... ప్రత్యక్ష సాక్షులు కూడా ఎవరూ లేరు కాబట్టి వారిని చంపకుండా జైల్లో 10-15 ఏళ్ళు మేపుతాం అని సుప్రీమ్ కోర్టు తీర్పునిచ్చేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: