నిన్న తెల్లవారుజామున దిశ హత్య కేసులోని నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేకానేక చర్చలకు మరియు అనుమానాలకు దారి తీస్తోంది. అయితే హైకోర్టు దీనిపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని నియమించగా వారి విచారణలో కొన్ని సంచలనమైన విషయాలు బయటపడ్డాయి. అసలు నలుగురు నిందితులను ఆ రాత్రి సమయంలో పోలీసు వారు ఘటనాస్థలానికి తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఏమిటని ఇక్కడ కమిటీ వారి నుంచి మరియు మానవ హక్కుల సంఘాల నుంచి వెలువడిన మొట్టమొదటి ప్రశ్న.


దీనికి పోలీసు వారు వారేమీ సాధారణ నిందితులు కాదని... పగటిపూట అక్కడికి వారిని తీసుకొని వెళితే సాధారణ ప్రజలు వారిపై దాడికి పాల్పడే అవకాశం ఉంటుందని అది ఈ పరిస్థితిని మరింత ఘోరంగా మారుస్తోందని వారు కారణంగా తెలిపారు. అయితే ఇక్కడ అందరి దగ్గర నుంచి బయటికి వస్తున్న ప్రశ్నలు ఏమిటంటే చనిపోయిన ఆ నలుగురు నిందితుల్లో ఇద్దరి చేతులలో తుపాకులు ఉండడం.

 

వారు ఎటువంటి నిందితులో తెలిసిన తర్వాత కూడా పోలీసు వారు అంత అజాగ్రత్తగా ఉండటం మరియు ఇద్దరి చేతుల్లోనే గన్నులు ఉంటే నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపడం మరియు కేవలం రాళ్లతో మరియు కర్రలతో దాడి చేసిన కారణంగానే పోలీసులు వారిని హతమార్చడం అనేది చాలా ప్రశ్నలకు దారితీస్తోంది.


అదీ కాకుండా వారు పోలీసులపై దాడి చేసి పరిగెడుతున్న సమయంలో పోలీసులు కాల్చి బల్లెట్లు వారికి వెనకవైపు నుండి కాకుండా ప్రతి ఒక్కరి మృతదేహం లోని బుల్లెట్లు ముందు వైపు గా ఉండడం పోస్టుమార్టంలో తేలింది. అంతేకాకుండా నిందితులు పోలీసువారి గన్నులతో కాల్పులు జరిపితే ఒక్క పోలీసుకి కూడా బుల్లెట్ గాయం కాకపోవడం గమనార్హం. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటినీ పరిశీలించి కమిటీ ఒక విచారణ జరిపి దీనిపై నివేదిక సమర్పిస్తుంది. అప్పటివరకు తెలంగాణ పోలీస్ వారిపై ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: