ఉత్తరాఖండ్ లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మెహ్రా అనబడే నేత బిజెపి కార్యకర్త ఒకరు తన వేలుని కొరికాడని చెప్పాడు. ఆకాశాన్నంటుతున్న ఉల్లిపాయ ధరలకు వ్యతిరేకంగా తాను ధర్నా చేస్తూ అలాగే ఉల్లిపాయలను అతి తక్కువ ధరకు అమ్ముతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ బిజెపి కార్యకర్త దాడిచేసి అతని చేతి వేళ్లను రక్తం వచ్చేటట్లు కొరికేశాడని పోలీసులకు వెల్లడించాడు.

 

అయితే జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయిన నందన్ మెహ్రా కాంగ్రెస్ నేత చెప్పిన నిందితుడు మనీష్ బిస్త్ ను శాంతపరిచేందుకు తాను ప్రయత్నించినా అతను తన తోటి నేతపై దాడి చేసి పెనుగులాటలో కోపంతో అతనిని బూతులు తిడుతూ చేతివేళ్లను అతి ఘోరంగా కొరికినట్లు వెల్లడించాడు.  అలాగే పెరుగుతున్న ఉల్లిపాయ ధరలకు వ్యతిరేకంగా తమతో పాటు పాల్గొన్న వారందరినీ అతను ఇష్టం వచ్చినట్లు తిట్టేసి దొరికిన వారిపై దొరికినట్లు దాడి చేసిన విషయాన్ని కూడా వెల్లడించాడు.

 

ఇక తన చేతిని గట్టిగా పట్టుకుని రక్తం వచ్చేలా వేలుని కొరికిన సమయంలో తనతోపాటు ఉన్న ఇతర పార్టీ సభ్యులు పోలీసువారికి ఫోన్ చేయడంతో తాను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు మెహ్రా వెల్లడించాడు. ఇకపోతే కాంగ్రెసు వైస్ ప్రెసిడెంట్ అయిన రమేష్ గోస్వామి మాట్లాడుతూ బిస్త్ అక్కడికి వచ్చి బిజెపి వారి నినాదాన్ని గట్టిగా అరుస్తూ అక్కడున్న వారందరినీ దూషిస్తూ మరియు మహిళా పార్టీ నేతలతో కూడా అసభ్యకరంగా ప్రకటించినట్లు ఆయన అన్నాడు.

 

పట్టణంలో కేజీ ఉల్లిపాయలను కేవలం 30 రూపాయలకే తాము బుద్ధ పార్క్ వద్ద అమ్ముతుండగా తమకు మద్దతు ఇవ్వడానికి వచ్చినా మెహ్రా ను బిస్ట్ అటాక్ చేయడమే కాకుండా అతనిపై ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకున్న ట్లు కూడా వెల్లడించాడు. ఇలా అత్యంత హింసాత్మకంగా తమ ధర్నాలు చెడగొట్టడానికి వచ్చిన ఇతను బిజెపి కార్యకర్త అని వెల్లడించాడు. ఇకపోతే బిజెపి పార్టీ వారు మాత్రం ఆ దాడి చేసిన వ్యక్తికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: