డాక్టర్ దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ లో కొన్ని కీలకమైన విషయాలు పెద్దగా ఫోకస్ కాలేదు. దిశ పట్ల కిరాతకంగా ప్రవర్తించిన ఆ నలుగురు మృగాలను అంతమొందించేందుకు 11 బుల్లెట్లను పోలీసులు వినియోగించారు. పోలీసులపై రాళ్లు.. కర్రలతో దాడి చేయడంతో పాటు.. వారి వద్ద ఆయుధాలు లాకున్న వేళ.. ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

 

ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం 11 బుల్లెట్లను వినిపోయోగించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ప్రధాన నిందితుడైన మహ్మద్ ఆరిఫ్ శరీరం లో నాలుగు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఛాతీలో రెండు.. కుడివైపు పక్కటెముకలో ఒక బుల్లెట్ దిగినట్లుగా తెలుస్తోంది. మరో నిందితుడు శివ బాడీలో ముడు బుల్లెట్ గాయాలు ఉన్నాయి. నవీన్ తలకు ఒక బుల్లెట్ గాయంతోనే కుప్పకూలినట్లు తెలుస్తోంది.

 

నాలుగో నిందితుడు చెన్నకేశవులుకు మూడు బుల్లెట్ గాయాలతో ఉన్నట్లు గుర్తించారు. అయితే నలుగురు నిందితుల మరణానికి కారణమైన ఆ 11 బుల్లెట్లలో ఒక్కటి కూడా నిందితుల శరీరంలో లేవు. తీవ్రమైన గాయం చేస్తూ.. దూసుకెళ్లిపోయాయి. దాంతో ఒక్క బుల్లెట్ కూడా రికవరీ కాలేదు. అత్యంత సమీపం నుంచి కాల్పు జరపడం వల్లే శరీరం నుంచి బుల్లెట్లు బయటకు వెళ్లినట్లు చెబుతున్నారు.

 

దిశ హత్య కేసులో నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్‍కౌంటర్ చేయడంతో దిశకు న్యాయం జరిగిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. దిశ ఆత్మ శాంతిస్తోందని సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కూడా స్పందిస్తోంది. “గ్రేట్ వర్క్ హైదరాబాద్ పోలీస్… వియ్ సెల్యూట్ యు… ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇదే శిక్షను అమలు చేయాలి అంటూ ఆమె ఈ ఘ‌ట‌న పై స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: