హైదరాబాదులో జరిగిన ఎన్ కౌంటర్ తో దేశమంతా ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అసలు ఎన్ కౌంటర్ సరైన రీతిలో జరిగిందా లేదా పక్కా ప్లాన్ ప్రకారమే ఆ నలుగురు నిందితులను చంపేశారా అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఆడపిల్లలపై చేయి వేయాలంటేనే కీచకులు వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఏళ్ల క్రితం ఢిల్లీలో ఒక బస్సులో నిర్భయను అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన నిందితులకు తక్షణమే మరణ దండన విధించాలని అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోందని అనేక వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.

 

విషయానికి వస్తే హైదరాబాదులో లాగానే నలుగురు నిందితులు ఢిల్లీలో నిర్భయను రేప్ చేసి రోడ్డుమీదికి విసిరేశారు. కొద్దిరోజులు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరికి సింగపూర్లో చికిత్స తీసుకుంటూ మరణించింది. అయితే అప్పుడు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు జైలులోనే అనుమానస్పద రీతిలో మరణించగా వారిలో ఇంకొకడిని రేప్ జరిగిన సమయంలో 18 ఏళ్లు నిండని కారణంగా జువెనైల్ జైలులో ఉంచారు. అయితే అప్పటినుండి నిర్భయ తల్లి తనకు న్యాయం కావాలని ఏడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది.

 

ఇప్పుడు దిశ హత్య కేసులో జరిగిన ఎన్ కౌంటర్ విషయంపై ఆమె స్పందిస్తూ కనీసం ఒక తల్లి కైనా అన్యాయం జరిగిందని... ఈ ఎన్ కౌంటర్ ఘటన తన గాయాలపై మందు లాంటిదని ఆమె పేర్కొంది. అయితే ఈ నెల డిసెంబర్ 13వ తేదీన కోర్టులో హియరింగ్ మరొకటి ఉందని... ఖచ్చితంగా ఈసారి నిందితులకు ఉరిశిక్ష పడేలా తాను ప్రయత్నిస్తానని చెప్పింది. అయితే ఇదే సమయంలో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ కూడా మాట్లాడుతూ ఇలా మహిళలపైన మరియు చిన్న పిల్లల పై అఘాయిత్యాలు జరిపే వారికి ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష కోరే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో రానున్న రోజుల్లో నిర్భయ కి కూడా న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: