దిశ హత్యకేసులో నిందితులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్  ను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసారని ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికి తెలిసిన విషయమే అందులో భాగంగా బయట ఉద్రిక్త పరిస్థుతుల మధ్య నిందితులను  బయటకు తీసుకురాకూడదనే ఉద్దేశంతో జైలు లోనే విచారణ జరిపిన విషయం కూడా తెలుసు అయితే ఆ నిందితులను సీన్ రికన్స్ట్రక్షన్ దృశ్య వారిని మళ్ళిసంఘటన స్థలానికి పోలీసులు తీసుకెళ్లారు. 

అక్కడ నలుగురు నిందితులు  కర్రలతో పోలీసులపై దాడికి దిగడంతో పాటు పోలీసుల దగ్గరి నుంచి గన్‌లు లాక్కొని కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అందుకే వారిని తప్పని పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ చేశామని సీపీ సజ్జనార్ ప్రకటించారు. అయితే తాజాగా షాద్‌నగర్‌ చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో పోలీసలు తనిఖీలు చేస్తున్నారు. నిందితుల శరీరం నుండి బయటపడ్డ బుల్లెట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీప్‌మెటల్‌ డిటెక్టర్‌తో బాంబ్‌ స్వ్కాడ్‌ టీమ్‌ తనిఖీలు చేస్తోంది. అయితే రాత్రి నుండి ఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం టెక్నికల్‌ టీమ్‌ సెర్చ్‌ చేస్తోంది. ఇప్పటికే పోలీసులు కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ ఎన్‌కౌంటర్‌ తో నిరసన తెలిపిన ప్రజలు, దిశ కుటుంబ సభ్యులు సంబరాలు మరియు సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రం దీనిని ఖండించారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎలాంటి దుస్సహసం  చేయడం మంచిది కాదని కోర్టు లు న్యాయవ్యవస్థ ను ధిక్కరించి ఎలాంటి చర్య కు ఘాటుగా స్పందించాయి. అలాగే ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ చర్యని తప్పు పట్టాడు. కొన్ని కారణాల దృశ్య ఇవాళ మహబూబ్‌నగర్‌కు NHRC ప్రతినిధుల బృందం రానుంది. మృతదేహాలను NHRC బృందం పరిశీలించిన తర్వాతే అంత్యక్రియలు జరపాలని సూచించినట్లు సమాచారం.

అలాగే కొందరు ఎలాంటి తప్పులు చేసిన వారు చాల మంది ఉన్నారని వారందరిని ఇలాగే చేయాలనీ కానీ వారికి కేవలం జైలు శిక్షకే పరిమితం చేసి ఇప్పుడు వీరిని మాత్రమే ఇలా చేయడం ఏంటి అని వీరు పేద కుటంబాలకు సంబందించిన వారు కాబట్టే  ప్రభత్వం  ఈ విదంగా నిర్ణయంచి ఆదేశాలు ఇచ్చిందని కొందరి వాదన అలాగే నిందితుడి భార్య దిశ హత్య కేసు లో నిందితుడైన నా భర్త కు జరిగిన చర్యే  అందరికి జరగాలి అని విచారం వ్యక్తం చేసింది. అయితే సోమవారం  ఈ బృందాలు శవాలపైనా కొన్ని విషయాలపైనా విచారం జరిపిన తదుపరి  అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.  ఎన్‌కౌంటర్‌ చెందిన మృతుల నిందితుల మృతదేహాలను పరిశీలింస్తారు. వారు ఇచ్చిన నివేదికను బట్టి ఈ కేసు పైన ఎం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: