దేశం లో బడుగు బలహీమా వర్గాలు మరియు సంచార  జాతులు అంటే దరిదాపున   ఎస్సీ, ఎస్టీ కి సంబందించిన జాతులే. ఎస్సీ, ఎస్టీ లు ఒక ఊరిని నివాసంగా జీవిస్తారు కానీ సంచార జాతులు వీరికి ఒక ఊరు మరియు శాశ్విత చిరునామా లేని జాతుల వారు వీరు. అయితే ఎలాంటి జాతుల వారిని   ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విషయాన్నీ పార్లమెంటు సమావేశాల సందర్బంగా   వైఎస్సార్‌ కాంగ్రెస్  పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంచార, విముక్త జాతులను ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి తీసుకురావాలని బుధవారం ఆయన రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. దళితులకు జరిగిన న్యాయం  ఈ అణగారిన వర్గానికి కూడా జరగాలనే ఉద్దేశం తో  మరియు ఈ వర్గాల ప్రజలు దౌర్జన్యాలు, దుర్మార్గాల పాలిట పడకుండా మన రాజ్యాంగ నిర్మాతలు రక్షణ కల్పించారని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం వచ్చిందని గుర్తు చేశారు కానీ ఈ చట్టం కేవలం ఎస్సీ, ఎస్టీలకె కాకుండా  . సమాజంలో అణచివేతకు, నిరాదరణకు గురయ్యే వర్గాల ప్రజలను అత్యాచారాలు, దౌర్జన్యాల నుంచి కాపాడటం  కోసం ఈ చట్టం ఏర్పాటు చేయాలనీ  ఆయన చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలను మాత్రమే ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చి మిగిలిన వారికంటే దుర్భర జీవితం అనుభవిస్తున్న  సంచార, విముక్త జాతులను విస్మరించడం దురదృష్టకరమని అతడు తన ప్రసంగం లో పేర్కొన్నారు.  సమాజంలో ఈనాటికీ సంచార ఇతర విముక్త జాతుల ప్రజలు దయనీయమైన జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే  వారు తరచుగా దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్నారని గుర్తుచేశారు. అత్యాచార నిరోధక చట్టం కింద ఉన్న ఎస్సీ, ఎస్టీల కంటే.. వారి పరిస్థితి దారుణంగా ఉందని ఆయన చెప్పారు. ఈ జాతులకు చెందిన ప్రజలను దోపిడీ, దౌర్జన్యాల నుంచి కాపాడటానికి ఎస్సీ, ఎస్టీలకు అందుతున్న న్యాయమే వీరికి కూడా జరగాలని వారి జీవనాభివృధి  కోసం  ఇప్పుడు దృఢ నిశ్చయంతో చర్యలు చేపట్టాలని సూచించారు  అప్పుడే వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించగలుగుతారని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: