దేశం మొత్తం కూడా ఉల్లి ధరల ఘాటు పెరిగిపోతోంది. పెరిగిన ధరలతో ప్రజల కంట కన్నీళ్లే వస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉల్లి ధరలు అదుపులోకి రావటం లేదు. ప్రస్తుతం కర్నూలులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ ధర రూ.8600కి పడిపోయింది. ఇప్పటివరకూ పెరగటమే జరిగిన ఉల్లి ధర సీజన్ లో తొలిసారిగా తగ్గుముఖం పట్టింది. కర్నూలు మార్కెట్ యార్డులో ఎగుమతులు చేయడంపై అధికారులు ఆంక్షలు విధించడంతో రేటు తగ్గటానికి కారణమంటున్నారు.

 

 

వ్యాపారులు ఉల్లిని ఇక్కడ కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయడం వల్ల ధరలు ఎక్కువగా పలుకుతున్నాయని అంటున్నారు. నిన్న విజయవాడ, శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల వద్ద మూడు లారీల ఉల్లి లోడును అధికారలు పట్టుకోవడం జరిగింది. దీంతో ఎగుమతులు నిలిపివేడంతోనే ధరలు అదుపులోకి వస్తున్నాయని అంటున్నారు. మరోవైపు ఉల్లి నాణ్యతలో తేడాల వల్ల కూడా ఉల్లి ధరలు తగ్గాయంటున్నారు. డిమాండ్ కు తగ్గట్టు నాణ్యమైన ఉల్లి రావట్లేదని అంటున్నారు. ఈ రెండు కారణాల వల్లనే ఉల్లి కొంత అదుపులోకి వచ్చాయంటున్నారు. కర్నూలు ప్రాంతంలో అధికంగా పండే ఉల్లి ఈసారి పంట దిగుబడులు తగ్గాయంటున్నారు. రెండు క్వింటాళ్ల ఉల్లి కూడా మార్కెట్ కు రావడం గగనంగా మారిందంటున్నారు.

 

 

నిన్న మార్కెట్ కు 1800 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వచ్చిందని ఈరోజు అవి కూడా రావట్లేదని అధికారులు అంటున్నారు. ఓపక్క కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్ లో ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుబజార్లలో ప్రజలకు సబ్సీడీపై రూ.25కే అందిస్తోంది. ఈరెండు ప్రాంతాల నుంచి రాష్ట్రం మొత్తానికి సరఫరా చేస్తున్నారు. ఇటివల కర్నూలు మార్కెట్ లో ఉల్లి క్వింటాలుకు రూ.13000కు చేరుకోవడం ఓ రికార్డుగా చెప్తున్నారు. ప్రభుత్వం రూ.130 కి వెచ్చించి కొనుగోలు చేస్తోంది. మొత్తానికి ఉల్లి ధర తగ్గడం కొంత ఊరటనిస్తోందనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: