మనిషి టెక్నాలజీ పరంగా ఎంత గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నా.. రెండు విషయాల్లో మాత్రం ధైర్యం చేయలేని పరిస్థితిలో ఉన్నారు.  ఒకటి దేవుడు.. రెండు దెయ్యం.  ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు విషయాల్లో మనిషి ఎప్పుడూ ఒకంత భయం, భక్తితో ఉంటున్నాడు.  అంతరిక్షాన్ని శాసిస్తున్న శాస్త్రవేత్తలు సైతం ప్రయోగానికి ముందు దైవ దర్శనం చేసుకోవడం ఆనవాయితి.. డాక్టర్లు సైతం మా ప్రయత్నం మేం చేశాం.. ఆ పైవాడి దయ అనే మాట అనడం చూస్తూనే ఉన్నాం.  ఇక సినిమాల్లో వీటి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. భక్తితో కూడుకున్న ఎన్నో సినిమాలు వస్తున్న నేపథ్యంలోనే భయపెట్టే దెయ్యం సినిమాలు కూడా వస్తున్నాయి.  ఈ జాఢ్యం ఎక్కువగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది.

 

 తాజాగా బిసంకటక్‌ సమితిలోని చాటికోన గ్రామంలో పాఠశాలలో 7,8 తరగతులు చదువుతున్న ఐదుగురు బాలికలు మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి సమయంలో పాఠశాల ఆవరణలో ఉన్న మర్రిచెట్టు కింద ఆడుకుంటున్నారు.. అయితే ఒక్కసారే వారి తీరులో మార్పు వచ్చింది.. మమ్ముల్ని దెయ్యం పిలుస్తుంది.. మేం వెళ్తాం అంటూ జుత్తు పీక్కోవడం.. కింద పడి గిల గిలా కొట్టుకోవడంతో స్థానికులు అక్కడకు చేరుకొని పిల్లలకు దెయ్యం పట్టిందని వెంటనే భూత వైద్యున్ని పిలిచి దెయ్యం వదిలించాలని అన్నారు.  ఇందుకు చదువుకున్న ఉపాధ్యాయులు సైతం సై అనడంతో భూత వైద్యుడు రావడం దయ్యాన్ని వదిలించడం జరిగింది.  ఆ తర్వాత ఉపాధ్యాయులు ఐదుగురు విద్యార్థులను బిసంకటక్‌ ఆస్పత్రికి తరలించారు.

 

ఓ వైపు దెయ్యాలు లేవు, భూతాలు లేవు దేవుడు అసలు లేడని కొంత మంది హేతువాదులు వాదిస్తుంటే చెబుతున్నారు.  ఎవరెన్ని చెప్పినా దెయ్యం, భూతం, చేతబడులు, భానామతి అంటూ గ్రామీణ, గిరిజన ప్రాంతలవారే కాదు పట్టణ వాసులు సైతం నమ్ముతున్నారు. దీనికి తోడు భూతవైద్యుడు మంత్రించగా విద్యార్థులకు స్వస్థత కలగడంతో వారిలో మూఢ నమ్మకాలు ఇంకా పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి బలహీనతలు ఆసరా చేసుకొని ఎంతో మంది దొంగబాబాలు గల్లి గల్లీలో పుట్టుకు రావడం.. డబ్బులు దోచుకోవడం చూస్తేనే ఉన్నాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: