కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై పలు ప్రజా, మహిళా సంఘాలతో పాటు ప్రజలు మరియు సెలెబ్రిటీలు సైతం తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నలుగురు యువకులు, ప్రియాంక స్కూటీ టైర్ పంక్చర్ చేసి, ఆపై ఆమెను మాయ మాటలతో మోసం చేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, అనంతరం ఘోరంగా చంపేసిన ఆ దారుణ ఘటన నిందితులను నిన్న సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. 

 

ఆ నీచులకు అదే సరైనదని, ముఖ్యంగా ఇటువంటి ఘటనలు ఇకపై జరుగకుండా ఉండాలంటే అటువంటి శిక్షలే అమలు చేయాలని పరులువురు ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. కాగా నేడు ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో అచ్చంగా అదే విధంగా కొందరు దుండగులు ఒక గిరిజన యువతిని ఘోరంగా రేప్ చేసి చంపేసిన ఘటన నేడు వెలుగులోకి రావడంతో అక్కడి స్థానిక ప్రజలు, దిశా ఘటన నిందితుల మాదిరిగా ఆ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కూడా క్రూరంగా కాల్చి చంపేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. 

 

ఆ యువతిపై ఘోరంగా అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే వరకు ఊరుకునేది లేదని, నేడు జైనూర్ ప్రాంతంలో బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. కాగా అక్కడి పరిస్థితులు కొంత అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని యువతికి న్యాయం చేస్తామని, దయచేసి గొడవ చేయొద్దని కోరుతున్నారు. అంతేకాక జైనూర్ ప్రాంతంలో ఎటువంటి దారుణాలు జరుగకుండా గట్టిగా భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. మన దేశంలో ఇటువంటి ఘటనల పట్ల ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇకపై ఇటువంటివి ఆగవని అంటున్నారు పలువురు మహిళా సంఘాల వారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: