నిత్యానంద మళ్లీ మకాం మార్చాడు. కైలాస దేశమంటూ హడావిడి చేసిన దొంగబాబా.. చెప్పాపెట్టకుండా పారిపోయాడు. ఇంతకీ నిత్యానంద ఎక్కడికెళ్లాడు..? ప్రస్తుతం ఎక్కడ ఆశ్రయం పొందుతున్నాడు..? 

 

అత్యాచారాల నిందితుడు నిత్యానంద మళ్లీ పారిపోయాడు. దొంగపాస్ పోర్టుతో దేశం విడిచి వెళ్లిపోయిన అతడు... కైలాసం నుంచి కూడా పారిపోయాడు. దీవిని కొనుగోలు చేసి దేశాన్ని తయారు చేయాలనుకున్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఈక్వెడార్‌ నుంచి హైతీకి మకాం మార్చాడు. ఈ విషయాన్ని ఈక్వెడార్‌ స్వయంగా ప్రకటించింది.  

 

నిత్యానంద దీవిని కొనుగోలు చేసి.. దేశంగా మార్చుకున్నారనే కథనాలు వచ్చాయి. ఇందుకు ఈక్వెడార్‌ సాయం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రభుత్వం స్పందించింది. నిత్యానందకు పౌరసత్వం ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెల్పింది. అతడితో తమకు సంబంధమే లేదని తేల్చి చెప్పింది. తనను శరణార్థిగా గుర్తించాలన్న నిత్యానంద అభ్యర్థనను కూడా తిరస్కరించినట్టు తెలిసింది. ఈక్వెడార్‌ నుంచి హైతీ వెళ్లారని వివరించింది అక్కడి ప్రభుత్వం.  

 

ఇటు భారత ప్రభుత్వం కూడా స్పందించింది. వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినంత మాత్రాన... దేశాన్ని నిర్మించడం కాదని తెల్పింది. అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద పాస్‌పోర్టును ఇప్పటికే  రద్దు చేసినట్లు వివరించింది. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. అన్ని దేశాల్లోని ఇండియన్ మిషన్స్, పోస్ట్‌లను అప్రమత్తం చేసినట్లు తెలిపింది విదేశాంగశాఖ. 

 

కైలాసం పేరుతో కొత్త లోకం నిర్మించానంటూ.. తన భక్తుల్లో ఎన్నో ఆశలు రేపిన నిత్యానంద ఇపుడు పారిపోవడం ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై ఆయన భక్తులు ఏమంటారో చూడాలి. ఇంకో ప్రదేశానికి మకాం మార్చిన నిత్యానంద ఈ విషయంపై ఏ వివరణ ఇస్తారో మరి.  నిత్యానంద కోసం ఇప్పటికే గాలిస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా పట్టుకొని ఇండియాకు తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని బృందాలు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏమేమి చేస్తున్నారు అనే విషయాలపై గట్టి నిఘా ఉంచాయి. నిత్యానంద కోసం ఇప్పటికే గాలిస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా పట్టుకొని ఇండియాకు తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని బృందాలు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏమేమి చేస్తున్నారు అనే విషయాలపై గట్టి నిఘా ఉంచాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: