భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు ఒక శుభ వార్త చెప్పింది. ఇక డబ్బులు లేకపోయిన మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని తరువాత డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకు వచ్చింది. ఈ మధ్యనే జనరల్ టిక్కెట్లకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే ఇక తాజాగా ఈ గుడ్ న్యూస్ తో రైల్వే శాఖ ను ప్రజలు అభినందిస్తున్నారు.

 

ప్రయాణం చేయాలనుకున్నప్పుడు టికెట్స్ బుక్ చేసుకునే సమయంలో పేమెంట్ ఆప్షన్ వద్ద పే లేటర్ ఆప్షన్ అను ఎంచుకోవాలి. అయితే ఈ సదుపాయం పొందాలంటే ఐఆర్‌సీటీసీ అకౌంట్ కలిగి ఉండాలి.

 

ఇలా బుక్ చేసుకోండి

 

1. మొదట మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ లేకపోతే మీ ఇమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తో సైన్అప్ మీద క్లిక్ చేసి కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకోండి.

2. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తరువాత మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ తో మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.

3. లాగిన్ అయిన తరువాత మీకు కావాల్సిన ట్రైన్ ను సెలెక్ట్ చేసుకుని బుక్ టికెట్ మీద క్లిక్ చెయ్యండి. వెబ్సైటు అడిగిన సమాచారం ఇచ్చిన తరువాత పే ఇప్షన్ మీద క్లిక్ చెయ్యండి.

4. పేమెంట్ ఆప్షన్లు ఒకసారి చూస్తే మీకు ఆ ఆప్షన్లలో పే లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. పే లేటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ టిక్కెట్ ను బుక్ చేసుకోండి.

 

పే లేటర్ ఆప్షన్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ డబ్బును 14 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ పే లేటర్ వాలెట్ ఒక్కొక్కరికి ఒక్కో లిమిట్ ను ఇస్తుంది. ఉదాహరణకు మీకు రూ 1000 ల లిమిట్ వచ్చింది అనుకోండి మీరు రూ 1000 లోపు మాత్రమే విలువ ఉన్న టికెట్స్ ను బుక్ చేసుకోవాల్సిన ఉంటుంది. ఇక మీ వాలెట్ లిమిట్ పెరగాలంటే 14 రోజుల్లోపు టికెట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: