సంచలనం సృస్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వారు మహబూబ్ నగర్ చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఎన్  కౌంటర్ మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం రిపోర్టును పరిశీలించారు. వీరి పర్యటనలో భాగంగా మృతుల కుటుంబ సభ్యులతో ఎన్ హెచ్ఆర్సీ బృందం మాట్లాడనుంది. వీరి పర్యటన నిమిత్తం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 

 

ఇప్పటికే మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ వద్దకు నిందితులు ఆరిఫ్, నవీన్, శివ కుటుంబసభ్యులు చేరుకున్నారు. మరో నిందితుడైన చెన్నకేశవులు కుటుంబం మాత్రం మార్చురీ వద్దకు రాలేదు. ఇప్పటికే చెన్నకేశవులు కుటుంబ సభ్యలు ఈ ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ధర్నా, రాస్తారోకో చేస్తన్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు గుడిగుంట్లకు వెళ్లి చెన్న కేశవులు కుటుంబం స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు. దిశ నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ పై దేశ ప్రజలంతా హర్షిస్తుంటే ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు పోలీసులకు నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది.

 

 

ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు మృతదేహాలను పరిశీలించిన అనంతరం వాటికి రీపోస్టుమార్టం చేయాలా అనే అంశాన్ని పరిశీలించనున్నారు. దీనిపై ఓ నిజనిర్ధారణ కమిటీ ఇచ్చే అవకాశం ఉంది. వారి శరీరాలపై తూటా గాయాలను పరిశీలించనున్నారు. అనంతరం చటాన్ పల్లిలో నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించనున్నారు. మృతదేహాలను తమకు అప్పగించాలని కుటుంబసభ్యలు కోరుతున్నారు. మృతుల కుటుంబసభ్యులు మాత్రం కోర్టు తీర్పు లేకుండా శిక్షించడం తగదని అంటున్నారు. మరోపక్క హైకోర్టు నిందితుల మృతదేహాలను ఈనెల 9వ తేదీ వరకు ఖననం చేయకూడదని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: