దిశ అత్యాచారం కేసు.. అతి తక్కువ సమయంలో అత్యాచారం జరిగిన యువతీకి న్యాయం జరిగిన ఘటన ఇదేనేమో. గత నెల 27న అతికిరాతకంగా వెటర్నరీ వైద్యురాలు దిశను సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి ఆమె శవాన్ని కూడా చూడకుండా చేశారు ఆ కిరాతకులు. దీంతో యావత్ దేశం ఈ ఘటనపై వ్యతిరేకాన్ని చూపారు. ఒక మహిళను ఇంత కిరాతకంగా హత్యాచారం చేస్తారా అని మండిపడ్డారు. 

         

ఈ నేపథ్యంలోనే మొన్న సీన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేసి పడేశారు. దీంతో దేశం అంత సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదని అయన అన్నారు. 

 

కాగా పగ తీర్చుకోవడం వల్ల న్యాయానికి ఉన్న గుణం పోతుందని అయన వ్యాఖ్యానించారు. రాజస్థాన్ హైకోర్టులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బాబ్డే ఈ సందర్భంగా దిశ ఘటనపై వ్యాఖ్యలు చేశారు. న్యాయ విచారణ జరిగాకే శిక్షలు విధించాలని, తక్షణ న్యాయం అడగడం సరికాదని అయన అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

 

కాగా దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ పై సమాజం అంత దిశకు న్యాయం జరిగింది అని చెప్పగా కొన్ని చోట్ల నుండి మాత్రం ఇలా చంపడం తప్పు అని చెప్తున్నారు. అయితే ఈ ఘటనలో దిశా నిందితులు నలుగురు 'ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు' చనిపోయారు. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయినా సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: