ఏంటో అంత సల్లబడింది.. ఇక ప్రశాంతం అనుకుంటే చాలు.. మళ్ళి అన్ని ఘటనలు తేరా మీదకు వస్తాయి. మొన్ననే ఈ అయోధ్య భూవివాదం తెర పడింది అనుకుంటే మళ్ళి తెరపైకి వచ్చింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. గత నెల నవంబర్ 9న అయోధ్యలో భూ వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై తాజాగా నాలుగు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. 

               

సుప్రీం కోర్టు తీర్పును సమీక్షించాలంటూ ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) తరఫున వేర్వేరుగా నలుగురు ముస్లింలు శుక్రవారం ఈ ఆరు పిటిషన్లు వేశారు. మౌలానా ముఫ్తీ హజ్‌బుల్లా, మహ్మద్‌ ఉమర్‌, మౌలానా మఫ్‌జూర్‌ రెహ్మన్‌, మిష్బాహుద్దీన్‌లు తాజాగా నాలుగు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇప్పుడు పిటిషన్లు వేసినవారు గతంలో కూడా పిటిషన్‌ దాఖలు చేశారు.

        

1992 నాటికి వారి స్వాధీనంలో ఉన్న స్థలం హిందువులకు చెందుతుందన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో ప్రస్తుతం ఉనికిలో ఉన్న బాబ్రీ మసీదు పూర్తిగా నాశమవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. డిసెంబరు 6, 1992న మసీదు ధ్వంసం కాలేదని, ఈ తీర్పుతో బాబ్రీని పూర్తిగా నాశనం చేయమని ఆదేశించినట్టయ్యిందని వివరించారు. 

               

అంతేకాదు, దేశంలో అశాంతి కలిగించాలని తాము కోరుకోవడంలేదు కానీ, ఏదైనా న్యాయం శాంతికి అనుకూలంగా ఉండాలని వారు పిటిషిన్లలో కోరారు. సీనియర్ లాయర్లు రాజీవ్ ధావన్, జఫ్రియాబ్ జిలానీలు ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున పిటిషన్లు దాఖలు చేశారు. తీర్పుపై రివ్యూ న్యాయం కోసం అన్వేషణలో భాగమేనని అన్నారు. తీర్పులో న్యాయం లేకుండా శాంతిని పొందలేమని, న్యాయం జరగకుండా శాంతి ఉండదని వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: