బ్యాడ్మింటన్ క్రీడలో మన దేశ పేరుని నల్ల దిశలా వ్యాపింప చేసింది పీవీ సింధు. బ్యాట్మెంటన్ లో మొదట సైనా నెహ్వాల్ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. కానీ, పీవీ సింధు సైనా నెహ్వాల్ సాధించలేని ఎన్నో ఘనతలను సాధించింది. 2016 ఒలింపిక్స్ లో రజత పతకాన్ని గెలిచి, అలాగే  2019 వరల్డ్  ఛాంపియన్షిప్ లో కూడా బంగారు పతకాన్నిగెలిచింది.

 

 పీవీ సింధు అలాగే గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ కలెక్టర్ గా ఆమెను నియమించారు. ఈ సమయంలో రెవెన్యూ శాఖలోని సిసిఎల్ఎ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ ఆమె శిక్షణ కూడా పూర్తి చేశారు. శిక్షణ అయితే పూర్తి అయింది కానీ, పోస్టింగ్ కోసం ఆమె ఎన్ని రోజులు వేచి ఉన్నారు. అయితే పీవీ సింధుకు తాజాగా తన తొలి పోస్టింగ్ ఇచ్చారు.

 

హైదరాబాదులోని లేక్ వ్యూ ప్రభుత్వ అతిథి గృహం ఓఎస్డీగా పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోటోకాల్ విభాగంలోని సహాయ డైరెక్టర్ హోదాని పెంచి ఓఎస్డీగా ఆమెకు ఈ పోస్టింగ్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన పీవీ సింధు 2020 లో టోక్యో ఒలంపిక్స్ కి సిద్ధం అయ్యేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీని కోసం ఆమెని ఆన్ డ్యూటీ సెలవులు మంజూరు చేయాలని కోరారు.

 

దీనికి సీఎం జగన్ స్పందిస్తూ ఆమెకు  ఆన్ డ్యూటీ సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అధికారులు కి చెప్పారు. రేపటి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు పీవీ సింధు ఆన్ డ్యూటీ లీవ్ లోఉంటారు. కానీ అసలు ఇలాంటి క్రీడాకారులకి ఇంతటి పోస్టింగ్ లు ఎందుకు ఇస్తారు ప్రభుత్వానికే తెలియాలి. వీరు డ్యూటీలు చేయలేరని అందరికీ తెలుసు. దీనిపై జగన్ కి ఎటువంటి విమర్శలు వస్తాయి తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: