నిన్న జరిగిన సమావేశం తర్వాత ప్రపంచ బ్యాంకు చైనాకి రుణాలు ఇవ్వడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం చైనాకు ఇప్పటి నుంచి 2025 వరకు ప్రతి యేటా ఒక బిలియన్ డాలర్ల నుంచి ఒకటిన్నర బిలియన్ డాలర్లు అతి తక్కువ వడ్డీతో రుణంగా ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ విషయంలో చైనా బద్ధ శత్రువు అయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర విషయాలు వ్యాఖ్యలు చేశాడు.

 

అసలు చైనాకు రుణం తీసుకోవాల్సిన అవసరం ఏముంది..?? వారి దగ్గర చాలా ధనం ఉంది. వాళ్ళు ఇంకొకరికి రుణాలు ఇస్తున్నారు, అలాంటి వారికి రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

 ఆయన తన ట్విట్టర్ ఖాతాలో "అసలు చైనాకు ప్రపంచ బ్యాంకు ఎందుకు రుణాలు ఇస్తుంది..?? అది ఎలా సాధ్యం చైనా వద్ద చాలా డబ్బు ఉంది..?? ఒకవేళ వారి దగ్గర లేకపోయినా వారు సృష్టించుకోగలరు. ఇక రుణాలు ఇవ్వడం ఆపండి" అంటూ ట్వీట్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా చైనాకు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వటం  తగ్గిస్తూ వస్తుంది. ట్రంప్ ప్రభుత్వంలో మరో సీనియర్ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 

 ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా. తన దగ్గర చాలా డబ్బు ఉంది అసలు వారి ప్రాజెక్టులకు సొంత నిధులు వాడుకునే సామర్థ్యం వాళ్లకు ఉంది.  వెనుకబడిన దేశాలకి అప్పులు ఇచ్చే స్థాయిలో ఉన్న చైనా ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది..?? అని ఘాటుగా ప్రశిస్తున్నారు అమెరికా ప్రజలు. గత కొన్ని రోజులుగా అమెరికా చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుత ట్రంప్ వ్యాఖ్యలతో వారి సంబంధాలు ఇంకా తగ్గి పోయే అవకాశాలు ఉన్నాయి. దీనితో భారత ఎగుమతులు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: