దేశ వ్యాప్తంగా ఇప్పుడు మహిళలు బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఎవరైనా తోడు తీసుకొని వెళ్లాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంది.  చిన్నారులు, వృద్దుల అనే తారతమ్యం లేకుండా కామం కళ్లుగప్పి కృర మృగాళ్లలా ఆడవారిపై రెచ్చిపోతూ అత్యాచారాలకు, హత్యలకు పాల్పపడుతున్నారు.  ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో ఈ దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.  భారత దేశంలో ఒకప్పుడు మహిళలను దేవతగా పూజించారు.. కానీ ఇప్పుడు మహిళలను ఆటబొమ్మళ్లా చూస్తున్నారు.  తమకు సంబంధం లేని వారు ఎవరైతే ఏంటీ అనే దురాలచనతో మహిళపై రాక్షసుల్లా రెచ్చిపోతూ అత్యాచారాలకు పాల్పపడుతున్నారు.  హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ దిశ ని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. చంపేసిన నిచులకు తగిన శాస్తి జరిగింది.  నిన్న ఉదయం దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నింధితులు పోలీసులపై దాడి చేయడాప్రయత్నించగా ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

 

 అయితే దిశ హత్యా నింధితుల ఎన్ కౌంటర్ వార్త వినగానే దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై హర్షాతిరేకలు మిన్నంటాయి.  దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులను హీరోల్లా పొగిడారు...వారిని ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు.  తాజాగా దిశపై జరిగిన దారుణ ఘటన మరువక ముందే... ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతి చెందిన విషయం దేశ ప్రజలను కన్నీరు పెట్టించింది. తాజాగా ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతి పట్ల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 

 

'ఉన్నావ్‌ బాధితురాలి మరణం హృదయవిదారకం. మానవత్వానికి సిగ్గుచేటు. ఆ ఘటన విని ఎంతో దిగ్భ్రాంతికి, ఆక్రోశానికి గురయ్యా. న్యాయం, భద్రత కోసం ఎదురుచూస్తూ మరో కుమార్తె ప్రాణాలు కోల్పోయింది' అని రాహుల్‌ ట్వీట్ చేశారు. ఇలా ఎంతో మంది ఆడకూతుళ్లు కామాంధుల చేతుల్లో అత్యాచారాలకు గురి అవుతున్నారు.. ఇప్పటికైనా సరైన చట్టాలు తీసుకువచ్చి వారికి ధైర్యం చెప్పాలని అన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: