వైసీపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏపీ ఆర్టీసీకి 1,200 కోట్ల రూపాయల నికరనష్టం వస్తోందని చెప్పారు. నెల రోజులకు 100 కోట్ల రూపాయల చొప్పున నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఇదే పరిస్థితుల్లో ఆర్టీసీని నడిపితే ప్రతి నెలా అప్పు పెరిగే పరిస్థితి ఉన్న దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో పల్లెవెలుగు, సిటీ సర్వీస్ లలో కిలో మీటర్ కు 10 పైసల చొప్పున మిగతా అన్ని సర్వీసులకు కిలో మీటర్ కు 20 పైసలు టికెట్ ధరలు పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారని పేర్ని నాని చెప్పారు.
 
ఆర్టీసీ ఎండీ ఎప్పటినుండి పెంచిన రేట్లు అమలవుతాయో చెబుతారని అన్నారు. మరో రెండు రోజుల్లో పెంచిన రేట్ల గురించి ప్రకటన వస్తుందని చెప్పారు. ఆర్టీసీకి 6,735 కోట్ల రూపాయల అప్పు ఉందని పేర్ని నాని చెప్పారు. డీజిల్ ఒక్క రూపాయి పెరిగితే ఆర్టీసీకి 30 కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పారు. ఆర్టీసీ 30 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తుందని పేర్ని నాని చెప్పారు. ఉద్యోగుల వేతనాలు పెరగటం వలన నష్టాలు పెరుగుతున్నాయని అన్నారు. 
 
గత కొన్ని సంవత్సరాల నుండి చార్జీలు పెరగకపోయినా డీజిల్ చార్జీలు పెరుగుతున్నాయని చెప్పారు. కొత్త బస్సులు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్ని నాని చెప్పారు. సామాన్యులు తిరిగే బస్సుపై కేవలం పది పైసలు మాత్రమే పెంచామని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా చార్జీలు పెంచారని ఆర్టీసీని బతికించటం కోసమే చార్జీలు పెంచుతున్నట్లు పేర్ని నాని తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఆర్టీసీ చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారీగా చార్జీలు పెరగటంతో తెలంగాణ రూట్లలో ప్రయాణించే ఏపీ బస్సులలో ప్రయాణించటానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం చార్జీలు పెంచిన కొన్ని రోజులకే ఏపీ ప్రభుత్వం చార్జీలు పెంచడం గమనార్హం. ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ప్రజలపై భారం పడే నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: