దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఉల్లి ధర అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడు  కురిసిన భారీ వర్షాలతో వరదల ఎక్కువగా వచ్చి  ఉల్లి దిగుబడి భారీగా తగ్గింది. దీంతో మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఏర్పడటంతో ఉల్లి ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది . ఇక ఉల్లి ధర  భారీగా పెరగడంతో సామాన్య ప్రజలకు ఉల్లి కొనడం భారంగానే మారిపోయింది.  ఉల్లి ధర భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు  ఉల్లిని  కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్య ప్రజలకు ఉల్లిని కోయకుండానే కళ్ళలో నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది లబోదిబోమంటూనే   ధరలు పెరిగినప్పటికీ ఉల్లిని కొనుగోలు చేస్తూ ఉంటే... కొంతమంది ఉల్లి  లేకుండానే వంటలు కానిచ్చేస్తున్నారు. 

 

 

 

 అయితే గత వారం రోజుల క్రితం కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో  ఉల్లి ధర అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రజలందరిని ఉలిక్కిపాటు కు గురిచేస్తున్న ఉల్లిధరలు తొలిసారిగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు ధర 8,600 పలికింది. విజిలెన్స్ అధికారులు కర్నూలు నుండి ఇతర రాష్ట్రాలకు ఉల్లి  ఎగుమతులను నిలిపివేయడంతో... ఉల్లి ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రజల అవసరాలను తీరకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయకూడదని అధికారులు నిర్ణయించడంతో ఉల్లి ఇతర ప్రాంతాలకు ఉల్లి ఎగుమతులు ఆగిపోయాయి. 

 

 

 

 కాగా ఉల్లి  ఎగుమతులు తగ్గిపోవడంతో ఒక్కసారిగా ఉల్లి ధర దిగివచ్చింది . గతంలో కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఆకాశాన్నంటిన ఉల్లి ధర ప్రస్తుతం తగ్గినట్లు  సమాచారం. ఇదిలా ఉండగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతుండటంతో...  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ భారీగా పెరిగిన ఉల్లి ధరలతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఉల్లిని అన్ని రైతు బజార్లలో కేవలం 25 రూపాయల సబ్సిడీ కింద అందజేస్తున్న విషయం తెలిసిందే. అన్ని రైతు బజార్లలో ప్రభుత్వం 25 రూపాయలకే సామాన్య ప్రజలకు ఉల్లి ని  అందజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: