దేశ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన విషయం అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా అభివృద్ధి లేకుండా ముందుకు సాగుతున్న మన దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలియజేశారు. దీనిలో భాగంగా మరిన్ని చర్యలు చేపట్టాలిసిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

 

 ప్రస్తుత ఆదాయ పన్నులో కూడా మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె ఈ విధంగా చెప్పారు. శనివారం జరిగిన ఒక సదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఆగస్టు , సెప్టెంబర్ నెలల్లో ఆర్థిక వ్యవస్థను బలపరిచే దిశగా ఎన్నో చర్యలు చేపట్టిందని ఆమె తెలిపారు. ఈ సదస్సులో ఆమెకి ఒక ప్రశ్న ఎదురయింది అది ఏమిటంటే ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చే చర్యలు చేపడతారని ఒకరు ప్రశ్నించారు దీనికి సమాధానంగా ఆమె "ఒకవేళ నేను అవును అంటే ఏప్పుడు అని అడుగుతారు, అలాగని కాదు అని చెప్తే ఎందుకు తీసుకోవడం లేదు అని ఎదురు ప్రశ్నిస్తారు" అని చమత్కారంగా సమాధానమిచ్చారు నిర్మల సీతారామన్.

 

అలాగే ఇంకొకరు ఆదాయపన్ను లో కూడా మార్పులు చేస్తారా అని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇస్తూ ఇది తమ పరిశీలనలో ఉంది అని సమాధానం చెప్పారు. ఇదే సదస్సులో ఆమె జీఎస్టీ లో మార్పులు కూడా తీసుకొనిరావాల్సిన అవసరం ఉందని చెప్పారు .జిఎస్టి లో కూడా చాలా వస్తువులపై టాక్స్ పెంచే అవకాశాలు ఉన్నాయని  ఈ సందర్భంగా ఆమె చెప్పారు. దీనితో ఎన్ని రకాల వస్తువులపై ధరల ప్రభావం ఉంటుందని కొన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే భయపడుతున్నారు జనాలు.దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందో ఎవరికి అర్థం కావటం లేదు.

 

 ఈ సంవత్సరం సెప్టెంబర్లో కార్పొరేట్ పన్ను తగ్గించిన ఈ ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయ పన్ను కూడా తగ్గించాలని అప్పటి నుంచి డిమాండ్ వస్తూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: