ఆన్లైన్ మెసేజ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు  తీసుకొస్తూ వినియోగదారులను  తెగ ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆన్లైన్ లో ఎన్నో మెసేజింగ్ యాప్స్ ఉన్నప్పటికీ వాట్సాప్ వాడే వినియోగదారులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు . ఎక్కువగా వాట్సాప్ ద్వారానే చాటింగ్ లు,  వీడియో కాల్స్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు స్మార్ట్ఫోన్ వినియోగదారుల. ఇక ప్రతి స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రస్తుతం వాట్సాప్ వాడని వినియోగదారులు చాలా తక్కువ మందే కనిపిస్తారు. ఇక ఆన్లైన్ ప్రపంచంలోనే మొత్తం సమయాన్ని గడిపే కొంతమంది వాట్సాప్ లో చాటింగ్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు . 

 

 

 

 అటు వాట్సప్ కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.  ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వాడుకలోకి తెస్తూ వాట్సప్ పాత వినియోగదారులను ఆకర్షించడమే కాదు కొత్త వినియోగదారులను  కూడా పెంచుకుంటూ ముందుకు సాగుతుంది వాట్సాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక తాజాగా మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది వాట్సాప్ .వాట్సాప్  పోర్ట్ పోలియో లో కాల్ వెయిటింగ్ ఫీచర్లు కూడా చేర్చేసింది. ఇప్పటి వరకు వాట్స్అప్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే మొదటి కాల్ పూర్తయ్యే వరకు మధ్యలో కాల్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి వీలుండేది కాదు. కానీ వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లతో మామూలు కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇతర వ్యక్తులు కాల్ చేస్తే వెయిటింగ్ కాల్ వచ్చినట్లుగానే వాట్స్అప్ కాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా వేరే వ్యక్తి వాట్సాప్ కాల్ చేసినప్పుడు వెయిటింగ్ కాల్ రావటమే కాదు  ఆ కాల్ ని  కూడా అటెండ్ అయ్యే అవకాశం  కూడా ఉంటుంది. 

 

 

 

 ఇక మనం వేరే వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి కాల్ చేస్తే అవతలి వ్యక్తికి కూడా కాల్ వెయిటింగ్ సందేశం వస్తుంది. ఐఓఎస్ యూజర్లు కు గత నెలలోనే వాట్సాప్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా... తాజాగా ఆండ్రాయిడ్ మొబైల్ యూసర్ లకు కూడా ఈ కాల్ వెయిటింగ్ ఫీచర్లు తీసుకువచ్చింది వాట్సాప్. కాగా గతంలో కూడా ఫింగర్ప్రింట్ అన్ లాక్ తీసుకొచ్చి వాట్సాప్ యూసర్స్  అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు బాగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక వ్యక్తి తో మాట్లాడుతున్నప్పుడు... వేరే వ్యక్తులు కాల్ చేస్తున్నప్పటికీ అది తెలుసుకునే అవకాశం ఉండేది కాదు... కానీ ప్రస్తుతం వాట్స్అప్ ప్రవేశపెట్టిన ఫీచర్తో వాట్సాప్ యూజర్లకు ఇది సాధ్యం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: