ఈ మధ్య ఎక్కడ చూసినా దొంగల బెడద మరీ ఎక్కువ అయిపోతుంది. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే సరీ వెంటనే ఇళ్ళు గుల్ల చేసేస్తున్నారు  దొంగలు. దొంగతనాల్లో కూడా వెరైటీ స్టైల్స్ చూపిస్తూ అందినకాడికి దోచుకో పోతున్నారు. ఇక దొంగతనం లో కూడా ఒక్కో దొంగది ఒక్కో స్టైల్ అన్నట్లుగా... చిత్ర విచిత్రంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.ఇప్పుడు ఎక్కడ చూసినా దొంగల బెడతా రోజురోజుకు ఎక్కువవుతోంది. అయితే దొంగలు దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు చాలా కష్టపడి ఇంట్లోకి చొరబడుతూ ఉంటారు. ఎవరికీ తెలియకుండా చాలా తెలివిగా లోపలికి ప్రవేశించాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఇక తీరా ఎంతో కష్టపడి లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ చిల్లిగవ్వ కూడా దొరకకపోతే... దొంగలకు మిగిలేది డిసప్పాయింట్ మెంటే కదా సుమీ. 

 

 

 

 ఇక్కడ ఓ దొంగకి అలాంటి పరిస్థితి ఎదురైంది. ఎంతో కష్టపడి ఇంట్లోకి ప్రవేశించిన ఆ దొంగకి  కూడా చిల్లి గవ్వ కూడా దొరకక పొయేసరికి దొంగకి కోపం వచ్చేసింది . ఇక ఆ తర్వాత దొంగ ఏం చేశాడో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. మధ్యప్రదేశ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చాలా కష్టపడి ఇంట్లోకి చొరబడిన ఓ దొంగకి చిల్లిగవ్వ కూడా దొరకక పొయేసరికి ఇంటి యజమానికి నిరసన తెలుపుతూ లేఖ రాశాడు ఆ దొంగ. ఆదర్శనగర్ లో ఫర్వేష్ సోనీ అనే ప్రభుత్వ ఇంజినీర్ ఉండే గవర్నమెంట్ క్వార్టార్స్ లో  దొంగతనం చేయాలని అనుకున్నాడు ఓ దొంగ . దీంతో అతి  కష్టం మీద కిటికీలను తొలగించి మరి ఆ క్వాటర్స్ లోకి ప్రవేశించాడు ఆ  దొంగ.

 

 

 అయితే దొంగ అంత కష్టపడి లోపలికి చొరబడినప్పటికీ అక్కడ మాత్రం విలువైన వస్తువు లేమీ కనిపించలేదు. ఆ దొంగకు ఎంతో ముఖ్యమైన నగదు నగలు మాత్రం అసలే లేవు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కనీసం తన కష్టానికి తగిన ఫలితం కూడా దక్కలేదు అని  ఆగ్రహించిన ఆ దొంగ ఇంటి యజమానికి ఓ లేఖ రాశాడు. నువ్వు పిసినారి...ని లాంటి వారిని నేనెక్కడా చూడలేదు అంటూ ఆ దొంగ రాసిన లేఖలో ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. కిటికీలు తొలగించే ఇంట్లోకి ప్రవేశించడానికి ఎంతో శ్రమించాను... కనీసం ఆ శ్రమకు తగిన ప్రతిఫలం కూడా దక్కలేదు అంటూ ఆ దొంగ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆ తర్వాత రోజు ఉదయం పనివాళ్ళు వచ్చి చూసే సరికి ఇంట్లో లేక కనిపించింది . ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: