గత కొంత కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం  జరుగుతోందని వార్తలు షికారు చేస్తున్నా. ఈ వార్తలపై తాజాగా టీటీడీ  చైర్మెన్ వై వి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అది కూడా క్రైస్తవ మత ప్రచారం జరుగుతుందని వార్తలు వినపడుతున్నాయి.. ఏపి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నప్పటి నుండి ఈ ప్రచారం బాగా పెరిగిందని వార్తలు గుప్పుమన్నాయి..

 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటై తర్వాత ఈ రచ్చ మరింత గా పెరిగి పోయింది. బస్సు టిక్కెట్లతో మొదలైన అన్యమత ప్రచారం రగడ… ప్రతీ వారం ఏదో ఒక రూపంలో వివాదామవు తూనే వుంది. ఈ నేపథ్యం లో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 


తిరుమల అనేది వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రవిత్ర స్థలం, యిటు వంటి స్థలంలో ఎలా వేరే మత ప్రచారం జరుగుతోందని అంటారు అంటూ ఆయన కామెంట్లు చేశారు.. తిరుమలలో వున్నది కలియుగ దైవం.. శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆయన ముందు అన్యమత ప్రచారం చేసే దమ్ము, ధైర్యం ఎవడికీ లేదు'' ఇవి వైవీ సుబ్బారెడ్డి తాజా వ్యాఖ్యలు. తిరుమలలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని, దాన్ని ఎవరూ ప్రోత్సహించలేదని సుబ్బారెడ్డి వాదిస్తున్నారు.

 


ఈ నేపథ్యం లో కొందరు అన్యమత ప్రచారం జరుగుతోందని ఏదేదో అంటున్నారు వాటి లో ఎటువంటి నిజం లేదు అంటూ అయ్యన కొట్టి పడేశాడు.. తిరుమల లో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించరని, అసలా దమ్మూ, ధైర్యం తమలో ఎవరికీ లేదని సుబ్బారెడ్డి అన్నారు. కలియుగ దైవంతో చెలగాటమాడే సాహసం తమ బోర్డు సభ్యులెవరు చేయరని ఆయన వ్యాఖ్యానించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: