కొద్దిరోజుల క్రితం నలుగురు నిందితులు డాక్టర్ ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని హైదరాబాద్ లోని తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతం వద్ద అత్యంత కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేసిన ఉదంతంపై మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగసి పడ్డాయి. ఇక ఆ ఘటనలో నిందితులను దాదాపుగా పదిరోజుల పాటు విచారించి తమ రిమాండ్ లో ఉంచిన పోలీసులు, మొన్న సీన్ రి కన్స్ట్రక్షన్ కోసం ప్రియాంకను దగ్ధం చేసిన చోటుకి తీసుకెళ్లగా, సడన్ గా పోలీసులను రాళ్లతో కొట్టి తప్పించుకుని పారిపోతుండగా నలుగురు నిందితులను పోలీసులు అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. 

 

ఇక ఈ ఘటనతో పోలీసుల పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిసాయి. అలానే ప్రధాని మోడీని మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ప్రజలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇకపోతే ఈ ఘటనలోని నలుగురు నిందితుల్లో ముగ్గురు మహబూబ్ నగర్ జిల్లా గుడిగండ్ల గ్రామానికి చెందిన వారు. కాగా వారి వ్యక్తిగత జీవితం మరియు అలవాట్లను గురించి నిన్న అక్కడి గ్రామస్థులు కొన్ని గుండె బద్దలయ్యే వార్తలు చెప్పారు. అవి విన్న పలువురు మీడియా వారికి నోట మాట రాలేదు అనే చెప్పాలి. అందులో ముగ్గురు నిందితులైన చెన్నకేశవులు, నవీన్, శివ ముగ్గురూ కూడా స్థానికంగా ఉండే మరికొందరు యువకులతో కలిసి లారీ పనులకు వెళ్తుండేవారని, అలానే వారు పలు రకాలుగా బైక్ లు వేసుకుని ఊరంతా ఇష్టం వచ్చినట్లు తిరగడం, 

 

అలానే మధ్యలో కొందరు ఆడవారిని కూడా ఏడిపించడం వంటివి చేసేవారని, అంతేకాక అతి పిన్న వయసులోనే వారికి సిగరెట్, పాన్, గుట్కా, మందు వంటి చెడు అలవాట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఊళ్ళో చాలామందికి వారి ధోరణి నచ్చేది కాదని, అయితే ఏదో కుర్రాళ్ళు కదా ఈ వయసులో కొంత అల్లరి చిల్లరిగానే ఉంటారులే అని ఊరిలోని వారు పెద్దగా పట్టించుకోలేదని, అయితే మొన్నటి ప్రియాంక రెడ్డి హత్య ఘటంత తెలిసిన తరువాత తమ ఊరందరికి, ఆ నీచులపై చంపేయాలన్నంత కోపం వచ్చిందని, అటువంటి నీచుల మూలాన మా ఊరికి చెడ్డ పేరు వచ్చిందని వారు వాపోతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: