ఎలాంటి రికార్డు అయినా బద్దలు కొట్టడం ఆటగాడికి సొంతం...బౌలర్  ఎవరైనా పరుగుల వరద పారించాడు అతగాడి నైజం...ప్రత్యర్థి జట్టు ఎవరైనా తన టీం ని విజయతీరాలకు నడిపించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య... ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారీ స్కోరు నెలకొల్పే అందరికీ మెస్మరైస్ చేయగల సత్తా   అతని సొంతం. ఆ గొప్ప ఆటగాడు ఇంకెవరో కాదు టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పిన  రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ. ఒక్కసారి బ్యాట్ పడితే చాలు పరుగుల  వరద పాలించగల రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే. చరిత్రలో నిలచిపోయే ఆటగాడు విరాట్ కోహ్లీ. తన దూకుడు జట్టులోని ఆటగాళ్లకు మరింత ఉత్సాహాన్ని నింపుతుంటాడు . ఇక ఎప్పుడు ఈ ఆటగాడు అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటాడు. 

 

 

 

 అయితే ఇప్పటికే ఎన్నో సరికొత్త రికార్డును నెలకొల్పిన విరాట్ కోలి తాజాగా మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. వెస్టిండీస్ తో  తొలి టి-20లో 94 పరుగులతో అదరకొట్టిన డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ... మరో ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పుడు వరకు టి-20లో మొత్తంగా కోహ్లీ చేసిన పరుగులు 2544... విరాట్ కోహ్లీ మరో మూడు పరుగులు చేస్తే టీమిండియా సిక్సుల వీరుడు రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును అధిగమిస్తాడు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ. అయితే రెండో టీ20లో అటు రోహిత్ కూడా ఆడుతాడు కాబట్టి రోహిత్ కంటే ఎక్కువ స్కోర్ చేయగలిగితేనే రికార్డుల రారాజు అయిన విరాట్ కోహ్లీ ఈ రికార్డును సొంతం చేసుకోగలడు. 

 

 

 

 కాగా తాజా ఇన్నింగ్స్లో అర్థసెంచరీ ద్వారా మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే అంతకుముందు వరకు ఆ రికార్డు కోహ్లీ పేరుమీదే ఉండగా... కోహ్లీని  వెనక్కినెట్టి రోహిత్ ఆ రికార్డును దక్కించుకున్నాడు. టీ-20లో ఫార్మాట్లో ఇప్పటివరకు అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబీ  పేరిట ఉన్న రికార్డును టీమిండియా కెప్టెన్ కోహ్లీ సమం చేశాడు. మొదటి టీ-20లో అద్భుతమైన ఫామ్లో అదరకొట్టిన విరాట్ కోహ్లీ రెండో టీ20లో అదే ఫామ్ కొనసాగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా  తిరువనంతపురం వేదికగా ఆదివారం రెండో టి20 జరగనుంది. మరి ఈ టి20 మ్యాచ్ లో కోహ్లీ పరుగుల వరద పారించీ సిక్సుల  వీరుడు రోహిత్ శర్మ ను  అధిగమిస్తాడా... లేకపోతే రోహిత్ రికార్డు నిలబెట్టుకుంటాడా  అనేది ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: