దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ' అత్యాచార ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్ తరువాత భారత దేశ న్యాయ వ్యవస్థపై అందరి దృష్టి మళ్లింది. దేశ రాజధాని దిల్లీలో 2012లో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన తరువాత భారత్‌లో అత్యాచారాలు, మహిళలపై నేరాల విషయం మరింత చర్చనీయమైంది.

 

నిర్భయ ఘటన తరువాత అటువంటి నేరాలపై పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. 2012లో అత్యాచార కేసులు దేశవ్యాప్తంగా 25 వేల కంటే తక్కువ ఉండగా, 2016 నాటికి 38 వేలకు పెరిగింది. 2017లో 32,559 అత్యాచార కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో విచారణ జరపడం కోర్టులకు కష్టమవుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ సంబంధాలున్నవారు అయినప్పుడు శిక్షల విషయం పెద్ద చర్చలకు దారి తీసేది. అప్పుడు తీర్పు రావటం చాల ఆలస్యం అవుతుంది.

 

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న బాబా ఆశారాం బాపు ఆ కేసుకు సంబంధించిన 9 మంది సాక్షులు దాడులకు గురయ్యారు. 2018లో ఆయనకు శిక్ష విధించారు.పెండింగులో ఉన్న అత్యాచార కేసుల సత్వర విచారణకు మరో 1000 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆచరణలోకి మాత్రం రాలేదు.

 

దక్షిణాఫ్రికాలో 2017లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం అత్యాచార కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో 8 శాతం మందికి మాత్రమే శిక్షలు విధించపడాయి. బంగ్లాదేశ్‌లో ఇలాంటి కేసుల్లో శిక్షల శాతం అత్యంత తక్కువగా ఉంది.దోషుల నిర్ధారణ రేటు ఎక్కువగా ఉన్న కొన్ని దేశాల్లోనూ చాలా కేసులు కోర్టులకు వరకు రావడం లేదు.

 

యూకేలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న అత్యాచార కేసులకు, కోర్టుల వరకు వెళ్తున్న కేసులకు మధ్య దూరం బాగాపెరుగుతోంది. కానీ, ఒక దేశానికి దేశానికి మధ్య అత్యాచార అర్థం, నేర నమోదు చేసే విధానం, విచారణ ప్రక్రియల్లో తేడాలు ఉంటాయి. అంతేకాదు, లైంగిక దాడులకు సంబంధించి బాధితులు, వారి కుటుంబాలు, చట్టాలు అమలు చేసే వ్యవస్థ ఎలా స్పందిస్తాయో అనే దాని మీద ఆధారపడి ఉంటాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: