దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా దేశంలో ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతూ  భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు ఉల్లిని కొనడం భారంగానే మారిపోయింది. ఏకంగా కిలో ఉల్లి ధర 120 నుంచి 150 రూపాయల వరకు పలుకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక సామాన్య ప్రజలకు ఉల్లిని కోయకుండానే కళ్ల నుంచి నీరు తెప్పిస్తోంది ఉల్లి ధర. అయితే ఉల్లి ధరలు అమాంతం ఒక్కసారిగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది ఉల్లి లేకుండానే వంటలు కానిచ్చేస్తున్నారు. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉల్లి కంట్రోల్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. 

 

 

 

 ఆయా రాష్ట్రాలలో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉల్లిని సబ్సిడీ రేటు కింద ప్రభుత్వం అందజేస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మరీ ప్రజలకు సబ్సిడీపై అందజేస్తూ ఉల్లిని  ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే ఉల్లి ధరలను క్యాష్ చేసుకుని తన బిజినెస్ ని పెంచుకునేందుకు ఓ సరికొత్త ప్లాన్ వేసాడు ఇక్కడ ఓ యువకుడు. ఇక యువకుడు వేసిన ప్లాన్ కాస్త విజయం సాధించింది. తన బిజినెస్ ఒక రేంజ్ లో ఇంప్రూవ్  అయిపోయింది. తమిళనాడు లోని తంజావూరు లో ఈ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా పత్తికొండ అనే ఊర్లో... శరవణ కుమార్ అనే వ్యక్తి ఎస్టీఆర్ అనే మొబైల్ షాప్ నడుపుతున్నాడు. అయితే ఉల్లి ధరలు పెరిగి ఉల్లికి  భారీగా  డిమాండ్ పెరిగిన నేపథ్యంలో తన షాపులో మొబైల్ కొనుగోలు చేసే వారికి ఒక కేజీ ఉల్లిపాయలు ఫ్రీగా ఇస్తా అంటూ ఆఫర్ ప్రకటించాడు. 

 

 

 

 అయితే ఈ విషయాన్ని మొత్తం ఒక ఫ్లెక్సీ ఫై ప్రింట్ చేయించి తన షాపు ముందు పెట్టాడు. ఇక ఉల్లి లి  డిమాండ్ బాగా పెరగడంతో ఇదేదో బాగుంది అంటూ జనాలు కూడా ఈ  షాపులోకి వెళ్లి కొత్త మొబైల్స్ కావాల్సిన వాళ్ళు కొనుక్కొని ఉల్లిని ఫ్రీ గా తీసుకుంటున్నారు. అయితే శరవణ కుమార్ అనే వ్యక్తి ఏడేళ్ల నుంచి మొబైల్ షాప్ నడుపుతుండగా... గతంలో రోజుకు 2 నుంచి 3 వరకు మాత్రమే సెల్ఫోన్ అమ్మేవాడు . కానీ ఈ సరికొత్త ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి రోజుకు 8 నుంచి 10 వరకు మొబైల్స్  అమ్ముతున్నట్లు సమాచారం. అయితే తమిళనాడులో కేజీ ఉల్లిపాయ ధర నూట నలభై రూపాయలు నుంచి 160 రూపాయల వరకు పలుకుతోంది. అయితే ఉల్లిపాయలను ఓ పది కేజీల వరకు కొని... వాటిని కేజీ చొప్పున కవర్లలో ప్యాక్ చేసి ఉంచుతున్నారు. ఇక తన దుకాణంలో సెల్ఫోన్లు కొన్నవారికి కిలో ఉల్లిపాయలను ఫ్రీగా ఇస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: