తెలుగుదేశం పార్టీని బలపరచాలి అని ఒక పక్క చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఆ పార్టీ నేతలు మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్ధం కాక చంద్రబాబు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు చంద్రబాబు... ఎంతగానో నమ్మిన అద్దంకి ఎమ్మెల్యే... గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు పార్టీ మారడానికి గాను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎంతో మంది న‌మ్మ‌వ‌ద్ద‌ని చెప్పినా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌న‌నేని వంశీకి బాబు మంచి ప్ర‌యార్టీ ఇచ్చారు.

 

పార్టీని వీడిన వంశీ పార్టీకి చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు గొట్టిపాటి ర‌వి కూడా  త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే... ఇప్పుడు మరికొందరు నేతలు చంద్రబాబుకి షాక్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో ఆయన నమ్మిన వాళ్ళు దూరమవుతున్నారు. 

 

చంద్రబాబుకి నమ్మకస్తులు గా ఉన్న రాజ్యసభ ఎంపీలు నలుగురు పార్టీ మారిపోయారు. ఇక దేవినేని అవినాష్ ని కూడా చంద్రబాబు ఎంతగానో నమ్మారు. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కి కూడా చంద్రబాబు విలువ ఇచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆయనకు సీటు ఇచ్చారు.
ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన బిజెపి నేతలతో ఎక్కువ సావాసం చేస్తున్నారు. 

 

తాజాగా నమ్మకస్తుడిగా ఉన్న బీదా మస్తాన్ రావు... వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుసు. ఆయ‌న పార్టీ ఆవిర్భావం నుంచి సిన్సియ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఆయన కూడా బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. ఇక కీలక నేతలుగా ఉన్న చాలా మంది ఇప్పుడు చంద్రబాబుకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని... జిల్లాలకు జిల్లాలు కాళీ అయ్యే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: