ఆంధ్ర ప్రదేశ్  రవాణా శాఖ మంత్రి పెర్ని వెంకటరామయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టిసి) ఛార్జీల పెంపును ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ప్రసంగించిన వెంకటరామయ్య, ఆర్టీసీని తీవ్ర ఆర్థిక సంక్షోభం నుండి కాపాడటానికి , ఆర్టీసీ బోర్డు ఛార్జీల పెంపు  కోరిందని, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దీనికి ఆమోదం తెలిపారు అని చెప్పారు.

 

 

 

 

సిటీ సర్వీస్ మరియు పల్లె వేలుగు బస్సులలో కిలోమీటరుకు 10 పైసలు మరియు మిగిలిన సర్వీసులలో కిలోమీటరుకు 20 పైసలు రేట్లు పెరిగే అవకాశం ఉందని,  సవరించిన ధరల అమలు తేదీని ఆర్టీసీ త్వరలో ప్రకటించనుంది  అని వెంకటరామయ్య చెప్పారు. ఇది ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం. ఆర్టీసీ   దివాలా తీయకుండా   ప్రైవేటీకరణ  సంక్షోభం నుండి బయట పాడటానికి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం, ఆర్టీసీకి, 6,735 కోట్ల నష్టం ఎదురవుతోంది అని మంత్రి పేర్కొన్నారు.    10 పైసల పెంపు సిటీ సర్వీసెస్, పల్లె వేలుగు సేవలను ఉపయోగించే సామాన్యులపై తక్కువ ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.   ఆర్టీసీ వివిధ బ్యాంకులకు 2,995 కోట్లు,  ఉద్యోగుల జీతాలు, పిఆర్‌సి బకాయిలు, ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతరులకు  3,740 చెల్లించాల్సి ఉందని ఆయన అన్నారు.

 

 

 

 

డీజిల్ ధర ఒక రూపాయి పెరిగితే,  ప్రతి సంవత్సరం 30 కోట్ల లీటర్లను ఉపయోగిస్తున్నందున ఆర్టీసీకి సంవత్సరానికి ₹ 30 కోట్ల నష్టం జరుగుతుంది. 2015 లో, చివరి పెంపు ప్రభావం చూపినప్పుడు, డీజిల్ ధర లీటరుకు ₹ 50 మరియు ఇప్పుడు ₹ 70 గా ఉంది   అని వెంకటరామయ్య చెప్పారు.  ఆర్టీసీ కి ధరలు పెరగకుండా , నష్టాలు లేకుండా పనిచేయడానికి సహాయపడే ఆలోచనలను స్వీకరించడానికి  ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

 

 

 

ఆర్టీసీ దరల పెంపు వలన ప్రభుత్వం  ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొంటుంది.   టిడిపి నాయకుడు, మాజీ మంత్రి కె. అచ్చన్నైడు మాట్లాడుతూ  ఆర్టీసీ చార్జీలు  పెంచడం ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని అన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: