ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి బలం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. రాజకీయంగా జగన్ వెంట ఆ జిల్లా నడిచింది ఈ జిల్లా. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎక్కువగా ఉన్న జిల్లా కావడం జగన్ కి ఎక్కువగా కలిసి వచ్చిన అంశం అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వైసీపీ జిల్లాలో చుక్కలు చూపించింది. ఎన్నికలకు ముందు జిల్లా నుంచి చాలా మంది నేతలు పార్టీ మారిపోయారు. వారికి జగన్ చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చారు కూడా... ఇక జిల్లా నుంచి ఇద్దరు నేతలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు.

 

ఈ ఎన్నిక‌ల్లో ప‌ది అసెంబ్లీ సీట్ల‌తో పాటు నెల్లూరు ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఇక ఇప్పుడు అక్కడ తెలుగుదేశం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. నారాయణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన నాయకత్వం మీద జిల్లా క్యాడర్ లో ఏ మాత్రం నమ్మకం లేదు. ప్రజాకర్షణ ఉన్న నేత కూడా ఆయన కాదు. ఇక ఆయన పార్టీలో ఉన్నా సరే స్థానిక నాయకత్వం పెద్దగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 

 

నారాయ‌ణ తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు తో కలిసి ఆయన పార్టీ మారినా మారిపోతారని అంటున్నారు. ఇక ఆయ‌న కుమార్తె ఇప్ప‌టికే జ‌గ‌న్ తో భేటీ అయ్యార‌న్న వార్తలు కూడా నారాయ‌ణ‌ను న‌మ్మే ప‌రిస్థితి లేకుండా చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే జిల్లా నుంచి సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని క్యాడర్, స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. ఆయన వలనే జిల్లాలో పార్టీ పరిస్థితి ఇలా ఉందని క్యాడర్ కూడా అంటున్నారు. 

 

తాజాగా చంద్రబాబుకి నమ్మకస్తుడిగా ఉన్న బీద మస్తాన్ రావు పార్టీని వీడారు. ఆయన వలన క్యాడర్ కూడా దూరమయ్యే అవకాశం ఉంది. త్వరలోనే వేంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన క్యాడర్ కూడా పార్టీ మారే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. సీనియర్ నేతలు ఇప్పటికే మంత్రి అనీల్ తో టచ్ లో ఉన్నారట. ఓవ‌రాల్‌గా చూస్తే జిల్లాలో నాయ‌కులు, ద్వితీయ శ్రేణి కేడ‌ర్ అంతా టీడీపీని వీడేందుకు రెడీ అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: