దేశంలో ఇప్పుడు ఏం జరిగినా సరే... తెలుగుదేశానికి అనుకూలమే. ఎన్డీయే నుంచి శివసేన బయటకు వస్తే తెలుగుదేశానికి లాభం, ఝార్ఖండ్ లో బిజెపి ఓడిపోతే తెలుగుదేశానికి లాభం... కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే తెలుగుదేశానికి లాభం... జనసేన బిజెపిలో కలుస్తుంది... తెలుగుదేశానికి లాభం... ఏది ఎక్కడ ఏం జరిగినా సరే తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుంది అంటూ వ్యాఖ్యలు చేసారు కొందరు. ఇక సోషల్ మీడియాలో తెలుగు రాయడం వచ్చిన చాలా మంది బిజెపి విషయంలో ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు.

 

ఇటీవల వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు... బిజెపి ఎంపీలను పదే పదే కలుస్తున్నారు. ఇటీవల బిజెపి పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ లో ఆయన సందడి చేశారు. ఇక ఆయన బయటకు వస్తుండగా తెలుగుదేశం అనుకూల మీడియా కొన్ని ఫోటోలు బయటపెట్టింది. ఇక ప్రధానిని ఆయన కలిసిన విషయంలో కూడా ఎక్కువ వ్యాఖ్యలు తెలుగుదేశం నుంచి వినిపించాయి. 

 

ఇటీవల వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి... అమిత్ షా ఛాంబర్ దగ్గరకు వెళ్లి బయట కూర్చున్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న రఘు అమిత్ షా ని కలవడానికి ఎదురు చూసారు... కాని వారిని కాదని రఘు రామ కృష్ణం రాజుని అమిత్ లోపలి పిలిచారు. దీనిని తెలుగుదేశం విజయంగా సోషల్ మీడియా చెప్పడం అందరిని విష్మయానికి గురి చేసింది. ఆయన బిజెపిలోకి వెళ్తే పార్టీకి వచ్చేది పది పైసల లాభం కూడా ఉండదు. 

 

ఆయన చంద్రబాబుకి సన్నిహితుడు కూడా కాదు... పోనీ తెలుగుదేశం ఎంపీలను అలా పిలిస్తే సంబరపడినా ఒక అర్ధం ఉంటుంది. పక్క పార్టీ ఎంపీని పిలిస్తే దానికి ఎక్కువ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువ సందడి చేస్తూ.. జనాలకు లేని పోనీ ఆశలు కల్పిస్తున్నారు టీడీపీలోని అతి ఉత్సాహ వంతులు.. మ‌రి వీళ్ల సంబ‌రాన్ని చూసి మ‌నం కూడా కాసేపు న‌వ్వుకుని వదిలేద్దామా..?

మరింత సమాచారం తెలుసుకోండి: